News August 14, 2025
ఆదిలాబాద్‌కు చేరుకున్న ప్రభుత్వ సలహాదారుడు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహదారుడు మమ్మద్ షబ్బీర్ అలీ ఆదిలాబాద్‌కు చేరుకున్నారు. ఆగస్ట్ 15 వేడుకల్లో భాగంగా నిర్వహించే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొననున్న షబ్బీర్ అలీ గురువారం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. దీంతో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ ఆయనకు పుష్పగుచ్ఛాన్ని అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
Similar News
News March 14, 2026
ఆదిలాబాద్‌లో పది పరీక్షకు 23 మంది గైర్హాజరు

ఆదిలాబాద్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిసాయి. జిల్లా వ్యాప్తంగా 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా శనివారం నిర్వహించిన పరీక్షకు 10887 మంది విద్యార్థులకు గాను 10864 విద్యార్థులు హాజరై 23 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 33 పరీక్ష కేంద్రాలను ఆయా జిల్లా అధికారులు విస్తృతంగా సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు.
News March 14, 2026
భూభారతి పనులను వేగవంతం చేయాలి: ADB కలెక్టర్

ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి పనులను వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి పథకాల అమలుపై శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.