News April 20, 2024

ఆదిలాబాద్‌లో మూడో రోజు నామినేషన్లు నిల్

image

ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మూడో రోజైన శనివారం ఎలాంటి నామినేషన్‌లు దాఖలు కాలేదని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఇప్పటివరకు మొత్తం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 22 నుంచి ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు ఆయన వెల్లడించారు.

Similar News

News December 11, 2025

హీరాపూర్‌: కోడలిపై అత్త విజయం

image

ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో అత్తాకోడళ్లు తలపడిన విషయం తెలిసిందే. ఈ రసవత్తర పోరులో అత్త తొడసం లక్ష్మీబాయి, కోడలు తొడసం మహేశ్వరిపై విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన లక్ష్మీబాయి 140 ఓట్ల తేడాతో గెలుపొందారు.

News December 11, 2025

ఇచ్చోడ: లక్కీ డ్రాతో సర్పంచ్ ఎన్నిక

image

ఇచ్చోడ మండలం దాబా(బి) గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ మొదలవగా, పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులకు సమానంగా 176 ఓట్లు వచ్చాయి. దీంతో లక్కీ డ్రా ద్వారా ఈశ్వర్‌ను సర్పంచ్‌గా ప్రకటించారు. ఈ విధంగా లక్కీ డ్రా ద్వారా విజేత ఎన్నికవడం ఉత్కంఠను రేపింది.

News December 11, 2025

ఉట్నూర్: భార్య సర్పంచ్, భర్త ఉపసర్పంచ్

image

ఉట్నూర్ మండలం లింగోజితండా గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సర్పంచ్ అభ్యర్థి జాదవ్ మాయ.. సమీప ప్రత్యర్థి విమలపై 88 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాగా ఆమె భర్త హరినాయక్ వార్డ్ మెంబర్‌గా గెలుపొంది ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఒకే ఇంట్లో రెండు పదవులు రావడంతో వారి మద్దతుదారులు సంబరాలు మొదలుపెట్టారు.