News February 15, 2025

ఆదిలాబాద్: అప్పు తీర్చలేక రైతు ఆత్మహత్య

image

ADB జిల్లా గుడిహత్నూర్ మండలం ఘర్కంపేట్ గ్రామానికి చెందిన మాధవ్ (53) అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం మధ్యాహ్నం ఆయన పురుగుమందు తాగి ఇంటికి వచ్చాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌లో రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ మహేందర్ తెలిపారు.

Similar News

News March 16, 2026

గ్యాస్ కొరత అంటూ అసత్య ప్రచారం.. వ్యక్తిపై కేసు: సీఐ

image

గ్యాస్ సిలిండర్ల కొరత అంటూ తప్పుడు సమాచారాన్ని వైరల్ చేసిన యూట్యూబర్‌ అమీర్ బాషాపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశాలతో క్రైం నంబర్ 40/2026 U/S 353, 196, 356 BNS సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ జయనాయక్ తెలిపారు. ప్రజల్లో గందరగోళం, అశాంతి రేకెత్తించేలా అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

News March 16, 2026

10వ తరగతి పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌ మృతి

image

కర్నూలు జిల్లాలో పదో తరగతి పరీక్షల వేళ మొదటి రోజు విషాద ఘటన జరిగింది. కర్నూలులోని పరీక్ష కేంద్రం శ్రీ చైతన్య పాఠశాలకు చీఫ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న షేక్ అన్వర్ బాషా అకస్మాత్తుగా మృతి చెందారు. గ్యాస్ట్రిక్ సమస్యతో ఆయన అస్వస్థతకు గురవగా సిబ్బంది పరీక్ష కేంద్రం సమీపంలోని అమ్మ హాస్పిటల్‌కు తరలించారు. హాస్పిటల్‌లో మృతి చెందినట్లు డీఈవో కార్యాలయం ధ్రువీకరించింది.

News March 16, 2026

NLG: రాజగోపాల్‌రెడ్డి రహస్య మీటింగ్ పెట్టారా?

image

రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెను దుమారం రేగింది. రేవంత్ సర్కార్‌పై అసహనంతో ఉన్న మునుగోడు MLA రాజగోపాల్‌రెడ్డి ఒక రహస్య డిన్నర్ మీటింగ్ నిర్వహించారని, 15 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం అందగా అందులో నలుగురు వచ్చారని సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. అయితే రాజగోపాల్ రెడ్డి రహస్య మీటింగ్ పెట్టారా లేదా అనే విషయమై ఇంకా స్పష్టత లేదు. దీనిపై MLA రాజగోపాల్ రెడ్డి స్పందిస్తారో లేదో వేచి చూడాలి.