News February 17, 2025

ఆదిలాబాద్: ఉరేసుకుని ఉపాధ్యాయుడి సూసైడ్

image

ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లా మావలలో చోటుచేసుకుంది. SI విష్ణువర్ధన్ వివరాల ప్రకారం.. నేరడిగొండ మండలం వెంకటాపూర్‌కు చెందిన బానోత్ సంతోష్ (28) జైనూర్ మండలం జామిని గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. కొన్నాళ్లుగా ఆదిలాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న సంతోష్ ఆదివారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 18, 2026

రోహిత్, కోహ్లీ రికార్డ్ బద్దలుకొట్టిన స్మృతి మంధాన

image

ఉమెన్స్ టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన రికార్డ్ సృష్టించారు. T20Iల్లో(మెన్స్&ఉమెన్స్) అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌గా నిలిచారు. స్మృతి 155 ఇన్నింగ్స్‌లో 4,244 రన్స్ చేసి రోహిత్(4,231), కోహ్లీ(4,188)ని వెనక్కి నెట్టారు. రోహిత్ 154, కోహ్లీ 117 ఇన్నింగ్సుల్లో ఈ పరుగులు చేశారు. నిన్న SAతో జరిగిన తొలి T20లో స్మృతి 13 రన్స్ కొట్టి ఈ ఫీట్ సాధించారు. అయితే ఈ మ్యాచులో IND 6 వికెట్ల తేడాతో ఓడింది.

News April 18, 2026

లోక్‌సభ నిరవధిక వాయిదా

image

లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. మూడు రోజులపాటు సాగిన సమావేశాలు నేటితో ముగిశాయి. నిన్న మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. ఉభయ సభలు నిరవధిక వాయిదా పడిన అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పలువురు ఎంపీలు ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. భేటీ అయిన వారిలో పీఎం మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.

News April 18, 2026

గజ్వేల్: భూసార పరీక్షా కేంద్రం అందుబాటులోకి వచ్చేనా..?

image

గజ్వేల్ పట్టణంలో భూసార పరీక్షా కేంద్రాన్ని 2023 అక్టోబరులో గత ప్రభుత్వంలో హరీశ్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే దీనికి ఇప్పటికీ సిబ్బంది నియామకం, ల్యాబ్ పరికరాలు లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో, ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, తమ భూములను పరీక్షించుకునే వెసులుబాటు కల్పించాలని స్థానిక రైతులు కోరుతున్నారు.