News May 22, 2024
ఆదిలాబాద్: ట్రాక్‌పై చెట్టు.. రైళ్లకు అంతరాయం

జిల్లాలోని తలమడుగు మండలం కోసాయి వద్ద గాలివాన కారణంగా చెట్లు రైలు పట్టాలపై పడిపోయాయి. దీంతో రాత్రి 7 గంటల వరకు ఆదిలాబాద్‌కు చేరుకోవాల్సిన ఇంటర్‌సిటీ రైలును మహారాష్ట్రలోని కిన్వట్ వద్ద నిలిపివేశారు. ఇదే రైలు ఆదిలాబాద్‌కు వచ్చి కృష్ణ ఎక్స్‌ప్రెస్‌గా 9 గంటలకు బయలుదేరాల్సి ఉంది. రైలు పట్టాలపై చెట్లు విరిగిపడటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు రైల్వేస్టేషన్‌లో పడిగాపులు కాస్తున్నారు.
Similar News
News March 8, 2026
ADB: ట్రేడ్ టెస్ట్ పరీక్షలకు దరఖాస్తులు

ITI సంబంధిత ఏదైనా ట్రేడుల్లో అనుభవం ఉండి సర్టిఫికేట్ లేని ప్రైవేట్ అభ్యర్థుల నుంచి ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ ITI ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ITI కోర్సులకు సంబంధించిన ట్రేడుల్లో కనీసం 3 సం.ల పని అనుభవం కలిగి, 21 వయస్సు వారు అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 15 లోపు వరంగల్‌లోని రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ అఫీసులో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News March 8, 2026
ADB: బాధితుల ఇండ్ల వద్ద ఎఫ్ఐఆర్ నమోదు

ఆదిలాబాద్ సబ్ డివిజన్ పరిధిలో బాధితుల ఇండ్ల వద్దకే శనివారం పోలీసులు వెళ్లి ఫిర్యాదులు స్వీకరించారు. డివిజన్ పరిధిలో 6 కేసులలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సులభంగా వేగంగా సేవలు అందించాలని లక్ష్యంతో బాధితుల ఇంటి వద్దకే వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధానాన్ని పోలీస్ శాఖ అమలులోకి తీసుకువచ్చిందని డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. ఇది బాధితులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు.