News December 2, 2025
ఆదిలాబాద్: నజరానా.. ఈసారైనా వచ్చేనా..?

పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకుంటే వాటికి ప్రభుత్వం నజరానా ప్రకటిస్తుంది. అయితే గత సర్పంచ్ ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లాలో 160, NRMLలో 88, ASF జిల్లాలో 49 పంచాయతీల్లో సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ పంచాయతీలకు ప్రభుత్వం ఇంకా నజరానా విడుదల చేయలేదు. ఈసారి ఏకగ్రీవం చేస్తే మళ్లీ నిధులు వస్తాయో లేదోనని ప్రజల్లో ఆందోళన నెలకొంది. నిధులు వస్తే పంచాయితీలు అభివృద్ధి చెందుతాయని భావిస్తున్నారు.
Similar News
News February 13, 2026
కోరుట్లలో ‘హస్తం’ హవా.. మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్

జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 33 వార్డులకు గాను కాంగ్రెస్ 18 స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన మెజారిటీని సాధించింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 8 వార్డులకు పరిమితం కాగా.. బీజేపీ 6 చోట్ల విజయం సాధించింది. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. హస్తం పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటడంతో మున్సిపల్ పీఠం ఆ పార్టీ పరం కావడం ఖాయమైంది.
News February 13, 2026
రైతులకు భూపరిహారం వెంటనే చెల్లించండి: కలెక్టర్

జాతీయ రహదారి 167/ఏ నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు పరిహారం వెంటనే జమ చేయాలని కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. కలెక్టరేట్‌లో జేసీ సంజన సింహతో కలిసి నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. విప్పర్ల, పురుషోత్తపట్నం, మాచవరం, కావూరు గ్రామాల రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. పరిహారం ఆలస్యంపై రైతులు ఆందోళనలో ఉన్నారని, దీనిపై జాప్యం చేయవద్దని అధికారులను ఆదేశించారు.
News February 13, 2026
జగిత్యాలలో జీవన్‌రెడ్డి అనుచరుల హవా!

TG: INCలో వివాదంగా మారిన జగిత్యాల మున్సి‘పోల్స్’లో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అనుచరులు రెబల్స్‌గా పోటీచేసిన అన్ని స్థానాలను కైవసం చేసుకున్నారు. మొత్తం 50 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. BRS MLA సంజయ్ అనుచరులకు పార్టీ టిక్కెట్లు దక్కడంతో జీవన్ రెడ్డి అనుచరులు 14 చోట్ల పోటీచేశారు. వాటన్నిటిలోనూ విజయం సాధించారు. ఇక ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో INC 12, BJP 4, BRS 4, MIM 2 వార్డులను దక్కించుకున్నాయి.


