News September 9, 2025
ఆదిలాబాద్ నుంచి నిర్మల్ జిల్లాకు జే.నర్సయ్య

సహకార శాఖలో ఆదిలాబాద్ జిల్లా డిప్యూటీ రిజిస్టర్, ఆడిట్ అధికారిగా పనిచేస్తున్న జే.నర్సయ్యకు స్పెషల్ క్యాడర్ డిప్యూటీ రిజిస్టర్‌గా పదోన్నతి లభించింది. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా సహకార అధికారిగా ఆయన నియమితులయ్యారు. టీఎన్జీవోస్ యూనియన్ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు ఆయనను కార్యాలయ సిబ్బందితో కలిసి శాలువాతో సత్కరించి, పూలబొకే అందజేసి అభినందనలు తెలిపారు.
Similar News
News December 9, 2025
కొత్తగూడెం: ‘హామీలు అమలు చేయకపోతే రాజీనామా’

గెలిపించిన మూడేళ్లలో హామీలు అమలు చేయకపోతే రాజీనామా చేస్తానని టేకులపల్లి మండలం కొత్తతండాలో సర్పంచ్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థి భూక్యా గీత బాండ్ పేపర్ రాసిచ్చారు. మినరల్ వాటర్ ప్లాంట్, లైబ్రరీ, ఓపెన్ జిమ్, ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి, ఆడబిడ్డ పెళ్లికి రూ.10వేలు, ముత్యాలమ్మ గుడి వరకు రోడ్డు ఏర్పాటు, ఎవరైనా అకాలంగా మరణిస్తే రూ.10వేలు ఇస్తానని బాండ్ పేపర్‌లో ప్రస్తావించారు.
News December 9, 2025
పాలకొండ: బైక్ ఢీకొని వ్యక్తి మృతి

పాలకొండ మండలం పణుకువలస వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం చోటుచేకుంది. పణుకువలస జంక్షన్ వద్ద నడుచుకుంటూ రోడ్డు దాటుతున్న పొట్నూరు రామినాయుడును బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన రామినాయుడుని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతుడు పాలకొండ మండలం బుక్కూరు గ్రామవాసిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.
News December 9, 2025
డెక్ భవనంలో మార్పులు!

సిరిపురంలో ఉన్న ది డెక్ భవనం ఇటీవలి కాలంలో మంచి క్రేజ్ పొందింది. మొత్తం 11 అంతస్తులు ఉన్న ఈ భవనంలో 6 అంతస్తులను రైల్వే జోన్ కార్యాలయం, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో పాటు పలు కంపెనీల ఆఫీసులకు కేటాయించారు. మిగిలిన 5 అంతస్తులను పార్కింగ్ కోసం ఉంచినప్పటికీ, వాటిని అద్దెకు ఇవ్వడానికి టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఒక పార్కింగ్ అంతస్తును ఆఫీస్ స్పేస్‌గా మార్చేందుకు వీఎంఆర్డిఏ సిద్ధమవుతోంది.


