News December 2, 2025
ఆదిలాబాద్: బ్రాండ్ మారింది గురూ…!

పంచాయతీ ఎన్నికలు మందు బాబులకు పండగను తీసుకొచ్చాయి. సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల నుంచి తమకు నచ్చిన బ్రాండ్ మద్యం అడుగుతున్నారు. కాదంటే మరో వర్గంలో చేరిపోతామని తేల్చి చెబుతున్నారు. దీంతో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. నిన్నటితో పాత మద్యం దుకాణాల గడువు పూర్తి కావడంతో ఆదివారం సరిపడా స్టాక్ దొరకలేదు. మందు బాబులు అడిగిన బ్రాండ్ దొరకకపోవడంతో సర్పంచ్ అభ్యర్థులు ఎక్కువ ఖర్చు పెట్టి మరి తెప్పించారు.
Similar News
News February 13, 2026
ఈనెల 15 నాటికి పూర్తి చేయాలి: కలెక్టర్

ఉపాధి హామీ కింద మెటీరియల్ పేమెంట్లను ఈనెల 15 నాటికి రూ.22.68 కోట్ల మేర పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులకు ఆదేశించారు. రోజుకు సుమారు రూ.7.35 కోట్ల పనులను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. సెలవు దినాలైనా సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. పాత పనులు పూర్తిచేసి పేమెంట్లు క్లియర్ చేయాలన్నారు.
News February 13, 2026
T20WC: USA భారీ స్కోర్

చెన్నై వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో USA చెలరేగి ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 196 రన్స్ చేసింది. ముక్కమల్ల సాయితేజ 79 పరుగులతో సత్తా చాటారు. మరోవైపు శుభమ్ 24 బంతుల్లోనే 48 రన్స్ చేశారు. 3 ఫోర్లు, 2 సిక్సులతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడే 3 వికెట్లు తీశారు.
News February 13, 2026
ఒక్క చోటా గెలవని తీన్మార్ మల్లన్న పార్టీ

TG: మున్సిపల్ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న పార్టీ ఒక్కచోటా గెలవలేకపోయింది. కత్తెర గుర్తుపై TRP అభ్యర్థులు పోటీ చేశారు. తమకు BC వర్గాల మద్దతు ఉంటుందని, కనీసం 40 స్థానాలు గెలుస్తామని మల్లన్న సహా నేతలు ప్రకటించారు. కానీ ఎక్కడా ఆ పార్టీ ప్రభావం కనిపించలేదు. సూర్యాపేటలోని 2 వార్డుల్లో మాత్రమే కొంతమేర ఓట్లు వచ్చాయి. ఇవి మినహా ఇంకెక్కడా డిపాజిట్లు కూడా దక్కలేదు.


