News November 20, 2025

ఆదిలాబాద్: యువతి సూసైడ్

image

ఆదిలాబాద్ అశోక్ రోడ్డుకు చెందిన స్రవంతి బుధవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న డయల్-100 సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ సునీల్‌కుమార్ వివరణ కోరగా, యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు ధ్రువీకరించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 23, 2026

147పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ &రీసెర్చ్<>(SAMEER<<>>)లో 147 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే (JAN 25) ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE/BTech, ME/MTech, MSc, BSc, డిప్లొమా, ITI ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష/ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఫిబ్రవరి 1న నిర్వహించనున్నారు. వెబ్‌సైట్: https://sameer.gov.in/

News January 23, 2026

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ‘త్వరలోనే ఎర్రబెల్లికి NOTICE’

image

ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలోనే మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు సిట్ నోటీసులు ఇస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే KR నాగరాజు అన్నారు. రాయపర్తిలో వార్ రూం ఏర్పాటు చేసి అనేక మంది ఫోన్లు ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు. మద్యం సేవిస్తూ, పేకాట ఆడుతూ.. సినిమా నటీమణులతో డాన్సులు వేయించారన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డాడని, అందుకే సిట్ ఆయనను విచారిస్తోందని MLA చెప్పుకొచ్చారు.

News January 23, 2026

పూజ చేయడం వెనుక సైంటిఫిక్ రీజన్

image

పూజ భక్తి మాత్రమే కాదు. గొప్ప మానసిక ప్రక్రియ కూడా. పూజలో వాడే గంటల శబ్దం మెదడులోని రెండు భాగాలను ఏకం చేసి ఏకాగ్రతను పెంచుతుంది. దీపపు కాంతి కంటి చూపును మెరుగుపరుస్తుంది. కర్పూరం, ధూపం గాలిలోని సూక్ష్మక్రిములను సంహరించి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందిస్తాయి. మంత్రోచ్ఛారణ తరంగాలు రక్తపోటును తగ్గిస్తాయి. మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. పంచేంద్రియాలను ఉత్తేజపరిచి, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.