News September 9, 2025

ఆదిలాబాద్: ‘యూనివర్సిటీ ఏర్పాటుకు ఉద్యమాలు నిర్వహిస్తాం’

image

గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు ఉద్యమాలు నిర్వహిస్తామని యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ రవి అన్నారు. మంగళవారం ఆదిలాబాద్‌లో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆదివాసీ గిరిజన జనాభా అధికంగా ఉన్న జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయకపోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, రియంబర్స్‌మెంట్ పూర్తి స్థాయిలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Similar News

News December 12, 2025

TU: ఈ నెల 24వ తేదీలోపు పరీక్షల ఫీజు చెల్లించాలి: COE

image

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని చదువుతున్న పీజీ M.A/MSW/M.Sc/M.Com/MBA/MCA 3వ సెమిస్టర్, ఇంటిగ్రేటెడ్ పీజీ (APE/PCH) 3, 5 సెమిస్టర్ల ఇంటిగ్రేటెడ్ PG(IMBA) 3, 5, 9 సెమిస్టర్ల రెగ్యులర్ పరీక్షల ఫీజు చెల్లించాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఈ నెల 24వ తేదీ లోపు విద్యార్థులు ఫీజు చెల్లించాలన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ సందర్శించాలన్నారు.

News December 12, 2025

నేను, గిల్ అలా చేసి ఉండాల్సింది: సూర్య

image

ఛేజింగ్‌లో తాను, గిల్ మంచి స్టార్ట్ ఇవ్వాల్సిందని SAతో 2వ T20లో ఓటమి తర్వాత IND కెప్టెన్ సూర్య అన్నారు. ప్రతిసారి అభిషేక్ మీద ఆధారపడలేమని, అతని ఆఫ్ డే అయినప్పుడు ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని చెప్పారు. తనతో పాటు గిల్, మిగతా బ్యాటర్లు ఇది అర్థం చేసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. తానైనా బాధ్యత తీసుకొని మరింత సేపు బ్యాటింగ్ చేయాల్సిందని చెప్పారు. తొలి టీ20లోనూ గిల్, SKY పేలవ ప్రదర్శన కనబరిచారు.

News December 12, 2025

TU: ఈ నెల 22లోపు LLB, LLM పరీక్షా ఫీజు చెల్లించాలి: COE

image

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని చదువుతున్న LLB 1, 3, 5 సెమిస్టర్ల, LLM 1, 3 సెమిస్టర్ల రెగ్యులర్ (థియరీ&ప్రాక్టికల్) పరీక్షల ఫీజు చెల్లించాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 22వ తేదీ లోపు విద్యార్థులు సంబంధిత కళాశాలలో ఫీజు చెల్లించాలన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ సందర్శించాలన్నారు.