News May 22, 2024

ఆదోనిలో ఓటువేయడంలో వెనుకబాటు

image

సార్వత్రిక ఎన్నికలు హోరాహోరిగా జరిగాయి. 2019 ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి ఎక్కువ శాతం పోలింగ్ నమోదైంది. కాగా ఆదోని నియోజకవర్గం ఓటర్లు ఇందుకు భిన్నంగా ఉన్నారు. ఆదోనిలో 66.5శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. నియోజకవర్గంలో 2,63,058మంది ఓటర్లు ఉండగా..1,75,064మంది ఓటు వేశారు. 87,994మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు.

Similar News

News March 15, 2026

కర్నూలు జిల్లా ప్రజలకు ఎస్పీ హెచ్చరిక

image

ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా డిస్కౌంట్లు, బహుమతుల పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రజలను హెచ్చరించారు. సోషల్ మీడియా, వాట్సాప్‌లలో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, గుర్తుతెలియని వ్యక్తులకు బ్యాంక్ వివరాలు లేదా OTPలు చెప్పవద్దని సూచించారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని వారు తెలిపారు.

News March 15, 2026

ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులుగా చేయడమే లక్ష్యం: కలెక్టర్

image

ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యని కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. ఆదివారం కర్నూలులోని శ్రీరామ్ నగర్‌లో ఉన్న నగర పాలక ప్రాథమిక పాఠశాలలో అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా అభ్యాసకులకు నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద అన్ని మౌలిక సదుపాయాలని కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు.

News March 15, 2026

కర్నూలు: నకిలీ మెసేజ్‌లతో జాగ్రత్త!

image

విద్యుత్ బిల్లుల పేరుతో వినియోగదారులకు వస్తున్న నకిలీ సందేశాలను నమ్మవద్దని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి సూచించారు. బిల్లు బకాయి ఉందని, వెంటనే చెల్లించకపోతే విద్యుత్ నిలిపివేస్తామని హెచ్చరిస్తూ కొందరికి నకిలీ మెసేజ్‌లు వస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి సందేశాలను నమ్మి ఎవరూ మోసపోవద్దని కోరారు. విద్యుత్ సేవలకు సంబంధించిన సమాచారం అధికారిక మార్గాల్లోనే అందిస్తామని చెప్పారు.