News November 14, 2024

ఆదోని: పోసాని కృష్ణ మురళిపై ఫిర్యాదు

image

ఆదోని పట్టణంలోని మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణ మురళిపై జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. వైసీపీ హయాంలో పవన్ కళ్యాణ్‌పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన పట్టణ అధ్యక్షుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే విధంగా పత్తికొండలో టీడీపీ నాయకులు పోసానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News March 12, 2026

జగన్ విమర్శలు దొంగే దొంగ అన్నట్లున్నాయి: ఆది కృష్ణమ్మ

image

కూటమి ప్రభుత్వంపై YCP అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విమర్శలు దొంగే దొంగ దొంగ అన్నట్లున్నాయనిని టీడీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ విమర్శించారు. కర్నూలులో ఆమె మాట్లాడారు. జగన్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైందన్నారు. ఐదేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమను కూడా తీసుకు రాలేదని ఆరోపించారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయకత్వంలోని రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు.

News March 12, 2026

ఉత్తమ సేవా పతకాలకు 27 మంది పోలీసుల ఎంపిక

image

కర్నూలు జిల్లా పోలీసు శాఖలో విశిష్ఠ సేవలు అందించిన 27 మంది అధికారులు, సిబ్బందికి 2025 సంవత్సరానికి గాను ఉత్కృష్ట సేవా పతకం, అతి ఉత్కృష్ట సేవా పతకాలకు ఎంపిక చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. స్మార్ట్ పోలీసింగ్‌తో పాటు వివిధ సేవల్లో ప్రతిభ చూపినందుకు ఈ పురస్కారాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో వీరికి పురస్కారాలు అందజేస్తున్నట్లు తెలిపారు.

News March 12, 2026

కర్నూలు జిల్లాలో 1.75 లక్షల హెక్టార్లలో రబీ పంటల సాగు

image

కర్నూలు జిల్లాలో 2025-26 రబీ సీజన్ పంటల నమోదు ప్రక్రియ పూర్తయిందని జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి గురువారం తెలిపారు. రైతు సేవా కేంద్రాల వారీగా వివరాలు అందుబాటులో ఉంచమని రైతులు తమ అభ్యంతరాలను రాతపూర్వకంగా రైతు సేవా కేంద్రాల్లో తెలియజేయాలన్నారు. అభ్యంతరాలకు ఒక్కరోజు మాత్రమే అవకాశం ఉందన్నారు. ఈకేవైసీ లేదా బయోమెట్రిక్ ద్వారా ప్రక్రియ పూర్తి చేయవచ్చని సూచించారు.