News April 23, 2025

ఆదోని మార్కెట్‌లో మళ్లీ పెరిగిన పత్తి ధరలు.!

image

కర్నూలు జిల్లాలో ఆదోని మార్కెట్‌లో పత్తి ధర నిన్నటితో పోలీస్తే క్వింటాకు రూ.150 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో దూది గింజల ధర స్వల్పంగా పెరగడం, పత్తి జిన్నింగ్ ప్రెస్సింగ్ పరిశ్రమల ఉత్పత్తికి అవసరమైన పత్తి మార్కెట్‌కి రాకపోవడంతో ధరలు పెరిగాయి. ఆదోని మార్కెట్‌లో మంగళవారం పత్తి క్వింటాల్ ధర గరిష్ఠంగా రూ.8,254 గా ఉంది. కనిష్ఠ ధర రూ.5,209 ఉండగా, మధ్యస్థ ధర రూ.7,639కి పెరిగింది.

Similar News

News March 13, 2026

గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ బుకింగ్‌కు 45 రోజుల గడువు

image

వంట గ్యాస్ సరఫరాపై ఒత్తిడి తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ బుకింగ్ నిబంధనల్లో మార్పులు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క సిలిండర్ తర్వాత మరో సిలిండర్ బుకింగ్‌కు కనీసం 45 రోజుల గడువు ఉండాలని నిర్ణయించింది. అయితే పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న 25 రోజుల నిబంధనే కొనసాగుతోంది. గ్యాస్ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను నివారించడమే లక్ష్యంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.

News March 13, 2026

అన్నదాతా సుఖీభవ-అర్హత ఇలా తెలుసుకోవచ్చు

image

ఆన్‌లైన్‌లో annadathasukhibhava.ap.gov.in/ ద్వారా రైతులు తమ అర్హతను తెలుసుకోవచ్చు. పైన పేర్కొన్న పోర్టల్‌కి వెళ్లి Know Your Status ఆప్షన్ ఎంచుకొని.. అక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి పక్కన ఉన్న క్యాప్చా ఎంటర్ చేయాలి. తర్వాత searchపై క్లిక్ చేస్తే.. మీ పేరు, జిల్లా, మండలం, గ్రామం వివరాలతో పాటు పథకానికి అర్హులైతే స్టేటస్ దగ్గర Eligile అని వస్తుంది. ఒకవేళ కాకుంటే Remarks దగ్గర అందుకు గల కారణాలు వస్తాయి.

News March 13, 2026

WGL: నేటి నుంచి అన్నీ ఆన్ లైన్‌లోనే!

image

RTAలో అవినీతిని అరికట్టేందుకు అన్ని సేవలను ఆన్‌లైన్‌లోనే చేసేలా ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి RTAలో పేపర్ లెస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వాహనాల రిజిస్ట్రేషన్, ఫామ్ 20, ఇతర పత్రాలన్నీ స్కాన్ కాపీలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వాహనం తీసుకోగానే డీలర్లు అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయాల్సిన బాధ్యత ఉంది. నకిలీ పత్రాలను సమర్పిస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.