News November 19, 2025
ఆన్‌లైన్‌లో అమ్మాయిలపై వేధింపుల్లో HYD ఫస్ట్!

నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఆన్‌లైన్‌లో చిన్నారులు, మహిళలపై జరుగుతున్న వేధింపుల్లో దేశంలోనే HYD నం.1గా నిలిచింది. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇలాంటి ఘటనలు హైదరాబాద్‌లో ఎక్కువగా నమోదయ్యాయి. ఆన్‌లైన్‌లో అసభ్య మెసేజ్‌లు పంపడం, మార్ఫింగ్ ఫొటోలు పంపించడం, అమ్మాయికి నచ్చకపోయినా వరుసగా మెసేజ్‌లు పంపుతూ ఇబ్బంది పెట్టడం వంటి వేధింపులు ప్రధానంగా కనిపిస్తున్నాయని నివేదికలో వెల్లడైంది.
Similar News
News January 23, 2026
ఖమ్మంలింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు: డీఎంహెచ్‌ఓ

జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే స్కానింగ్ సెంటర్లను సీజ్ చేస్తామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి రామారావు హెచ్చరించారు. శుక్రవారం పీసీపీఎన్డీటీ చట్టం అమలుపై జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. చట్టవిరుద్ధంగా పరీక్షలు చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. జిల్లాలో స్కానింగ్ సెంటర్ల నమోదు, రెన్యూవల్ కోసం వచ్చిన 24 దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
News January 23, 2026
147పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ &రీసెర్చ్<
News January 23, 2026
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ‘త్వరలోనే ఎర్రబెల్లికి NOTICE’

ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలోనే మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు సిట్ నోటీసులు ఇస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే KR నాగరాజు అన్నారు. రాయపర్తిలో వార్ రూం ఏర్పాటు చేసి అనేక మంది ఫోన్లు ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు. మద్యం సేవిస్తూ, పేకాట ఆడుతూ.. సినిమా నటీమణులతో డాన్సులు వేయించారన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డాడని, అందుకే సిట్ ఆయనను విచారిస్తోందని MLA చెప్పుకొచ్చారు.


