News November 19, 2025

ఆన్‌లైన్‌లో అమ్మాయిలపై వేధింపుల్లో HYD ఫస్ట్!

image

నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఆన్‌లైన్‌లో చిన్నారులు, మహిళలపై జరుగుతున్న వేధింపుల్లో దేశంలోనే HYD నం.1గా నిలిచింది. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇలాంటి ఘటనలు హైదరాబాద్‌లో ఎక్కువగా నమోదయ్యాయి. ఆన్‌లైన్‌లో అసభ్య మెసేజ్‌లు పంపడం, మార్ఫింగ్ ఫొటోలు పంపించడం, అమ్మాయికి నచ్చకపోయినా వరుసగా మెసేజ్‌లు పంపుతూ ఇబ్బంది పెట్టడం వంటి వేధింపులు ప్రధానంగా కనిపిస్తున్నాయని నివేదికలో వెల్లడైంది.

Similar News

News January 18, 2026

NLG: మారిన రిజర్వేషన్లు.. డివిజన్ల కోసం సెర్చింగ్!

image

NLG కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీల్లోనూ రిజర్వేషన్‌లు మారిపోయాయి. తాము పోటీచేసిన స్థానంలో అనుకూలమైన రిజర్వేషన్ కాకుండా మహిళలకు వచ్చిన స్థానాలు ఉన్నాయి. అలాంటి చోట్ల తమ సతీమణులను బరిలో నిలిపేందుకు సిద్ధం అవుతున్నారు. NLG కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీల్లోనూ గతంలో పోటీ చేసి గెలిచిన స్థానాల్లో ఈ సారి రిజర్వేషన్లు మారిపోయాయి. దీంతో తమకు అనుకూలమైన డివిజన్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

News January 18, 2026

నిర్మల్: యువకుడి సూసైడ్

image

పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. SI వివరాల ప్రకారం.. ఖానాపూర్ మండలం ఎర్వచింతల్‌‌కు చెందిన సాయికుమార్(24) దుబాయ్‌లో రెండేళ్లు పని చేసి 3 నెలల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తూ మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం తండ్రిని బైక్ అడగగా ఆయన ఇవ్వలేదు. కోపంతో పురుగు మందు తాగాడు. నిజామాబాద్‌లో చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు.

News January 18, 2026

కర్నూలు: చుక్కలు చూపిస్తున్న చికెన్ ధరలు

image

కర్నూలు జిల్లాలో చికెన్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కోడుమూరు, గోనెగండ్ల, పెద్దకడబూరు, పత్తికొండ, ఆలూరు, ఆస్పరి, ఎమ్మిగనూరు, ఆదోని, దేవనకొండ తదితర మండలాల్లో లైవ్ కిలో రూ.195, స్కిన్‌ రూ.300, స్కిన్‌లెస్ రూ.310-320 చొప్పున విక్రయిస్తున్నారు. మటన్ కిలో రూ.800-900, చేపలు రూ.180కి అమ్ముతున్నారు. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి.