News September 10, 2025

ఆన్‌లైన్ అడ్మిషన్లకు రెండు రోజులు అవకాశం: డీఐఈవో

image

వరంగల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఆన్‌లైన్ ఇంటర్ అడ్మిషన్లకు రెండు రోజులు చివరి అవకాశం కల్పించనున్నట్లు DIEO శ్రీధర్ సుమన్ తెలిపారు. ఇంటర్ అడ్మిషన్ల గడువు ఆగస్టు 31తో చివరి అవకాశం ముగిసినప్పటికీ పలువురు విద్యార్థుల అడ్మిషన్ పెండింగ్ ఉందన్నారు. దీంతో ఈనెల 11, 12న అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News December 12, 2025

మన జిల్లాను టాప్ టెన్‌లో నిలిపేలా కృషి చేయాలి: నంద్యాల కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సర్వీసుల మెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం ఏపీ సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ప్రభుత్వ సీఎస్ విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నంద్యాల జిల్లా అన్ని పారామీటర్లలో రాష్ట్రంలో టాప్ టెన్‌లో నిలిపేలా కృషి చేయాలని కలెక్టర్ జిల్లా అధికారులను ఆదేశించారు.

News December 12, 2025

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి: శ్రీశైలం ఎమ్మెల్యే

image

ఈనెల 12న ఆత్మకూరులోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి తెలిపారు. 10 కంపెనీలతో జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. సుమారు 800 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని చెప్పారు. పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన నిరుద్యోగులు జాబ్ మేళాను వినియోగించుకోవాలని కోరారు. https://naipunyam.ap.gov.inలో నమోదు చేసుకోవచ్చన్నారు.

News December 12, 2025

జట్టులో సూర్య, గిల్ అవసరమా?

image

T20ల్లో పేలవ ఫామ్ కొనసాగిస్తున్నా కెప్టెన్, వైస్ కెప్టెన్ అనే కారణంతో సూర్య, గిల్ కంటిన్యూ అవుతున్నారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. గత 14 T20ల్లో గిల్ 263 పరుగులే చేశారని, అటు తన చివరి 20 మ్యాచుల్లో SKY కేవలం 227 రన్సే కొట్టారని చెబుతున్నారు. వీళ్ల కోసం ఫామ్‌లో ఉన్న శాంసన్, జైస్వాల్‌ బలవుతున్నారని SMలో పోస్టులు పెడుతున్నారు. వీరిని టీం నుంచి తొలగించాలనే డిమాండ్లు విన్పిస్తున్నాయి. దీనిపై మీ COMMENT.