News November 13, 2024
ఆయనపై చర్యలు తీసుకోవద్దు: హైకోర్డు
వేమూరు మాజీ MLA మేరుగు నాగార్జున క్వాష్ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో మేరుగుపై పద్మావతి అనే మహిళ అత్యాచారం కేసు పెట్టగా.. ఇటీవల కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్టేట్‌మెంట్ ఇచ్చారు. కేసును ఏం చేస్తారని హైకోర్టు పోలీసులను అడిగింది. రిటర్న్ రిపోర్టు ఇవ్వాలంటూ పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా వేసింది.
Similar News
News December 9, 2024
ఎన్జీవో కాలనీలో NTR విగ్రహావిష్కరణ చేసిన పెమ్మసాని
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎన్జీఓ కాలనీలో ఆదివారం సాయంత్రం టీడీపీ వ్యవస్థాపకుడు NTR విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కేంద్ర సహాయమంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, గళ్ళా మాధవి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
News December 8, 2024
జిల్లా వ్యాప్తంగా పీజీఆర్ఎస్ సేవలు: కలెక్టర్
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS)ను ఈ సోమవారం నుంచి మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు, డివిజనల్ కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాలలో సమర్పించుకోవచ్చన్నారు. ప్రజలకి పాలనను మరింత చేరువ చేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు.
News December 8, 2024
LLB ప్రవేశాలకు 9న స్పాట్ అడ్మిషన్లు
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర విభాగానికి సంబంధించి ఈ నెల 9న సోమవారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. వివరాలను యూనివర్సిటీ అడ్మిషన్ డైరెక్టర్ పి.బ్రహ్మజీరావు తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన వారు నేరుగా అడ్మిషన్ కార్యాలయానికి వచ్చి ప్రవేశాలు పొందవచ్చు అన్నారు. లా సెట్ రాయని వారికి కూడా ఈ ప్రవేశాల్లో అర్హులన్నారు.