News November 8, 2025
ఆయిల్ ఫామ్ రైతులకు మేలు చేస్తున్న కీటకం

ఆయిల్ పామ్ సాగులో పరాగసంపర్కం కీలకం. దీనిపైనే పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది. ఈ పంటలో గాలి ద్వారా సంపర్కం సాధ్యం కాదు. అందుకే జగిత్యాల రైతులు ఆయిల్ పామ్ పంటల్లో పరాగసంపర్కం కోసం ఆఫ్రికన్ వీవిల్ అనే కీటకాన్ని వినియోగిస్తున్నారు. చాలా చిన్నగా ఉండే ఈ కీటకం పరాగ సంపర్కానికి కీలక వాహకంగా పనిచేస్తూ దిగుబడి పెరిగేందుకు సహకరిస్తోంది. దీని వల్ల దిగుబడులు గణనీయంగా పెరిగాయని జగిత్యాల రైతులు చెబుతున్నారు.
Similar News
News January 18, 2026
హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబోరేటరీలో ఇంటర్న్‌షిప్

DRDOకు చెందిన హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబోరేటరీలో 40 పెయిడ్ ఇంటర్న్‌షిప్‌లకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. BE/BTech 7, 8వ సెమిస్టర్, MTech ఫస్ట్ ఇయర్/ సెకండ్ ఇయర్ చదువుతున్న వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in
News January 18, 2026
బాబాయ్‌ని చంపినంత ఈజీ కాదు రాజకీయాలు: CM CBN

AP: రాజకీయాలు చేయడం అంటే బాబాయ్‌ని చంపినంత ఈజీ కాదని CM చంద్రబాబు అన్నారు. చిల్లర రాజకీయాలు చేస్తే ఇక్కడ ఉన్నది NDA ప్రభుత్వం, CBN అని గుర్తుపెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. TDP కుటుంబ సభ్యుల కృషితోనే తాను సీఎం అయ్యానని తెలిపారు. అధికారం కోసం ఏనాడు ఆరాటపడలేదన్నారు. గొంతు మీద కత్తి పెట్టి TDPని విడిచిపెట్టమంటే ప్రాణాలు వదిలిపెట్టే కార్యకర్తలు ఉన్నారని NTR 30వ వర్ధంతి కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.
News January 18, 2026
చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే..

చలికాలంలో చర్మం నిస్తేజంగా, పొడిగా మారుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. రోజుకు రెండుసార్లు మాయిశ్చరైజర్ రాయడంతో పాటు స్నానానికి గోరువెచ్చని నీరే వాడాలని చెబుతున్నారు. నిద్రపోయే ముందు నూనె, లోతైన మాయిశ్చరైజర్లతో స్కిన్ కేర్ చేసుకోవాలి. దీనివల్ల మృదువైన చర్మాన్ని పొందొచ్చు. తగినంత నీరు తాగాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.


