News December 11, 2025

ఆయుర్వేద స్నానం గురించి తెలుసా?

image

చాలామంది పనుల హడావుడిలో త్వరత్వరగా స్నానం ముగించేస్తుంటారు. కానీ శరీరానికి కలిగిన శ్రమను మర్చిపోయేలా చేసేదే నిజమైన స్నానం. ఆయుర్వేదం ప్రకారం స్నానం చేసే నీళ్లల్లో కొన్ని పదార్థాలు కలిపి చేస్తే హాయిగా ఉంటుంది. స్నానం చేసే నీటిలో కాస్త గంధం పొడి, మల్లెలు, గులాబీ రేకలు వేసుకుని చేస్తే ఒళ్లంతా చక్కని సువాసన వస్తుంది. కమలాపండు, నిమ్మతొక్కలను వేడినీళ్లలో వేసుకుని స్నానం చేస్తే శరీరం తేలిగ్గా అవుతుంది.

Similar News

News January 23, 2026

భర్తను చంపిన భార్య.. కీలక విషయాలు

image

AP: గుంటూరు(D) దుగ్గిరాలలో భర్తను భార్య చంపి రాత్రంతా పోర్న్ వీడియోలు చూసిన <<18921625>>కేసులో<<>> కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త నాగరాజే తనకు పోర్న్ వీడియోలు చూడటం అలవాటు చేశాడని విచారణలో భార్య మాధురి చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఇక తన బిడ్డ అలా చేసుండదని, ఆమెను ఘోరంగా అవమానిస్తున్నారని మాధురి తల్లి బీబీసీ వద్ద వాపోయారు. కాగా ప్రియుడు గోపీతో కలిసి భర్త నాగరాజును మాధురి హత్య చేసినట్లు కేసు నమోదైంది.

News January 23, 2026

ఈ నెల 27న ‘జన నాయగన్’పై తుది తీర్పు

image

విజయ్‌ నటించిన ‘జన నాయగన్’ సినిమా సెన్సార్‌ వివాదంపై మద్రాస్‌ హైకోర్టు ఈ నెల 27న తుది తీర్పు ఇవ్వనుంది. ఇటీవల కోర్టు తీర్పును <<18907956>>రిజర్వ్‌<<>> చేసిన విషయం తెలిసిందే. చిత్రానికి U/A సర్టిఫికెట్‌ ఇవ్వాలని సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ CBFC అప్పీల్‌ దాఖలు చేయడంతో వివాదం చెలరేగింది. డివిజన్‌ బెంచ్‌ ఇరుపక్షాల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మూవీ విజయ్‌ చివరి సినిమా కావడం గమనార్హం.

News January 23, 2026

‘రిపబ్లిక్ డే‘ వేడుకల్లో అమరావతి రైతులకు ప్రత్యేక గ్యాలరీ

image

AP: రిపబ్లిక్ డే ని మొదటిసారి ఈ ఏడాది అమరావతిలోని సీడ్ యాక్సిస్ రోడ్డులో నిర్వహించేందుకు CRDA అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో అమరావతి రైతులకు ప్రత్యేక VIP గ్యాలరీ ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేక ఆహ్వాన పత్రికలు పంపుతున్నారు. 13 వేల మందికి వీలుగా సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకూ రిపబ్లిక్ డే, స్వతంత్ర దినోత్సవాలను విజయవాడ మున్సిపల్ స్టేడియంలో చేపట్టేవారు.