News December 5, 2025

ఆయుష్మాన్ భారత్ పథకంలో మధుమేహ రోగులను చేర్చాలి: ఎంపీ

image

ఆయుష్మాన్ భారత్ పథకంలో టైప్-1 మధుమేహం రోగులను, అవుట్ పేషెంట్ సేవలు కూడా చేర్చాలని ఎంపీ శ్రీ భరత్ పార్లమెంట్‌ సమావేశాల్లో కోరారు. ఇన్సులిన్, గ్లూకోజ్ లాంటి ముఖ్య ఔషధాలు ప్రజారోగ్య సంస్థల్లో నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇన్సులిన్ ఒక మందు మాత్రమే కాదని, జీవనాధారమన్నారు. వీటి లభ్యత, ధరల సమస్య కారణంగా ఎవరూ ప్రాణం కోల్పోకూడదని, ఈ విషయంలో కేంద్రం తక్షణమే స్పందించాలన్నారు.

Similar News

News January 13, 2026

విశాఖ: 9 ట్రావెట్ బస్సులపై కేసు నమోదు

image

ఉప రవాణా కమిషనర్ ఆర్‌సీ‌హెచ్.శ్రీనివాస్ ఆదేశాల మేరకు సోమవారం కుర్మాన్నపాలెం వద్ద మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ బుచ్చిరాజు, రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించని 9 ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేశారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయకూడదని ఆదేశించారు.

News January 13, 2026

విశాఖ: ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు సహకరిస్తున్న ఇద్దరి అరెస్ట్

image

క్రికెట్ బెట్టింగ్‌కు సహకరిస్తున్న ఇద్దరు నిందితులను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. టెలిగ్రామ్ ఛానళ్ల ద్వారా ప్రచారం చేస్తూ ప్రధాన నిందితులకు బ్యాంక్ అకౌంట్లు, మ్యూల్ అకౌంట్లు సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రజలకు ఎక్కువ డబ్బులు ఆశ చూపి మోసాలకు పాల్పడ్డారు. రంగారెడ్డికి చెందిన కనుకుట్ల సంతోష్ రెడ్డి, ఖమ్మంకు చెందిన అబ్బూరి గోపిలను అరెస్ట్ చేశారు.

News January 12, 2026

గ్రేటర్ విశాఖ బడ్జెట్‌ ఎంతంటే?

image

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్‌కు స్థాయి సంఘం ఆమోదం తెలిపింది. మొత్తం బడ్జెట్ పరిమాణం రూ.4047.12 కోట్లుగా నిర్ణయించారు. ప్రారంభ నిల్వగా రూ.365.96 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. మొత్తం జమలు రూ.4180.37 కోట్లు కాగా, వ్యయం రూ.4047.12 కోట్లుగా అంచనా వేశారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ బడ్జెట్‌ను స్థాయి సంఘం ఆమోదించింది.