News August 20, 2025
ఆరుగురు విద్యార్థుల మృతిపై మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. నీటి గుంతలో పడి శశికుమార్, కిన్నెర సాయి, సాయి కిరణ్, భీమ, వీరేంద్ర, మహబూబ్ అనే చిన్నారులు మృతిచెందిన ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. ఎంతో ఉన్నతమైన భవిష్యత్తు గల బాలలు ఇలా అర్ధాంతరంగా చనిపోవడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాల అండగా నిలుస్తుందని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
Similar News
News January 17, 2026
బాడీ స్ప్రే ఎక్కువగా వాడుతున్నారా?

చెమట నుంచి వచ్చే దుర్వాసనను తప్పించుకునేందుకు కొందరు, మంచి సువాసన కోసం మరికొందరు బాడీ స్ప్రేలు వాడుతుంటారు. అయితే వీటిని ఎక్కువగా వాడటం వల్ల పలు సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే ప్రొపిలిన్ గ్లైకాల్ అనే రసాయనం వల్ల దీర్ఘకాలంలో కాంటాక్ట్ డెర్మటైటీస్, హైపర్ పిగ్మెంటేషన్, గ్రాన్యూలోనూ వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్, పారాబెన్ లేని వాటిని వాడాలని సూచిస్తున్నారు.
News January 17, 2026
కన్నుల పండువగా భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శనివారం భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం వేడుక ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళ తాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి బేడా మండపంలో కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్య వాచనం అనంతరం కంకణ ధారణ, యౌక్త్రధారణ గావించి నిత్య కళ్యాణాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు.
News January 17, 2026
వరంగల్: జోన్ల వారీగా పోలీస్ స్టేషన్ల వివరాలు! 2/2

(NSPT ACP) చెన్నావుపేట, నెక్కొండ, నెక్కొండ సర్కిల్, ఖానాపూర్,
(మామూనూర్ ACP) మామూనూర్, పర్వతగిరి, పర్వతగిరి సర్కిల్, ఐనవోలు, గీసుగొండ,సంగెం, ఎనుమాముల
వెస్ట్ జోన్-ASP- జనగామ, నర్మెట్ట సర్కిల్, నర్మెట్ట, తరిగొప్పుల, బచ్చన్నపేట
(స్టే.ఘ.ACP) ఘన్పూర్, రఘునాథపల్లి సర్కిల్, చిల్పూర్, రఘునాథపల్లి, లిం.ఘ.
(వర్ధన్నపేట), వర్ధన్నపేట సర్కిల్, వర్ధన్నపేట, రాయపర్తి, జఫర్ గడ్, పాలకుర్తి, కొడకండ్ల,దేవరుప్పుల


