News February 7, 2025
ఆరు సెక్టార్లుగా బందోబస్తు: SP కృష్ణారావు

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి తీర్థం జరిగే ప్రాంతాన్ని ఆరు సెక్టార్లుగా విభజించామని కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు తెలిపారు. బందోబస్తు ఏర్పాట్లపై ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. సెక్టార్ల వారీగా సిబ్బందికి విధుల కేటాయింపుపై ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలుజరగకుండా పక్కాగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అమలాపురం, కొత్తపేట డీఎస్పీలు ప్రసాద్, మురళీమోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Similar News
News February 16, 2026
WNP: రేపు ఈ మండలాలకు పపర్ కట్

వనపర్తిలోని 220/ 132/ 33 కేవీ ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని వనపర్తి డీఈ శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వనపర్తి పట్టణం, వనపర్తి రూరల్ గ్రామాలు, పాన్‌గల్, గోపాల్‌పేట్, ఏదుల, పెబ్బేర్, రేవల్లి, పెద్దమందడి, కొత్తకోట మండలాల వినియోగదారులు సహకరించాలని కోరారు.
News February 16, 2026
HYDలో ‘బయో ఏషియా 2026’ గర్జన రేపే షురూ

ఆసియాలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్& హెల్త్-టెక్ సదస్సు ‘బయో ఏషియా 2026ను TG CM రేవంత్ రెడ్డి ఈ నెల 17న సదస్సును అధికారికంగా HITEXలో ప్రారంభించనున్నారు. 50కి పైగా దేశాల నుంచి 4,000 మంది ప్రతినిధులు, 500కుపైగా కంపెనీలు, 175కు పైగా ఎగ్జిబిటర్లతో భారీ అంతర్జాతీయ ప్రదర్శన ఏర్పాటు చేశారు. TG రైజింగ్ 2047 విజన్ ద్వారా గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా మార్చడం వంటి అంశాలపై దృష్టి సారించనుంది.
News February 16, 2026
FLASH: మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత

AP: చంద్రగ్రహణం నేపథ్యంలో మార్చి 3న 9AM-7.30PM మధ్య శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు TTD అదనపు EO వెంకయ్య చౌదరి వెల్లడించారు. 5AM నుంచి 10AM వరకు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. ఆ తర్వాత అన్నిరకాల దర్శనాలను, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఆ రోజున 3.20PM నుంచి 6.47PM వరకు గ్రహణం ఉంటుందన్నారు.


