News March 8, 2025
ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం కృషి చేయాలి: కొణతాల

అల్లూరి జిల్లాలో గిరిజనులు ఉత్పత్తి చేస్తున్న చింతపండు పసుపు అల్లం తదితర వాటికి ఆర్గానిక్ సర్టిఫికేషన్ వచ్చే విధంగా కృషి చేయాలని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ శుక్రవారం శాసనసభలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సర్టిఫికేషన్ లభిస్తే గిరిజన ఉత్పత్తులకు మంచి గుర్తింపుతో పాటు ఆదాయం లభిస్తుందని అన్నారు. అరకు కాఫీకి ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉండడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందని అన్నారు.
Similar News
News January 12, 2026
మంచిర్యాల: బాల కార్మికులను వినియోగిస్తే కఠిన చర్యలు

మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో బాల కార్మికులను వినియోగిస్తే ఎన్నికల సంఘం బాలల పరిరక్షణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో గోడ ప్రతుల అతికింపు, ప్లెక్సీల ఏర్పాటు, కరపత్రాల పంపిణీ, ప్రచార సమయంలో ప్లకార్డుల ప్రదర్శన, సభలు, సమావేశాలలో బాలబాలికలతో పనులు చేపిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.
News January 12, 2026
కోల్డ్ వేవ్స్.. వీళ్లకు ముప్పు ఎక్కువ!

మరికొన్నిరోజులు చలిగాలుల తీవ్రత కొనసాగుతుందని IMD హెచ్చరించింది. దీంతో గుండె, లంగ్స్, కిడ్నీ వ్యాధిగ్రస్థులు జాగ్రత్తగా ఉండాలని ఎయిమ్స్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ‘చలికాలంలో రక్తనాళాలు కుంచించుకుపోతాయి. నీరు తీసుకోవడం తగ్గుతుంది. ఉప్పు వాడకం పెరుగుతుంది. ఇవి BP, హార్ట్ అటాక్ ప్రమాదాన్ని పెంచుతాయి’ అని కార్డియాలజీ ప్రొఫెసర్ రాజీవ్ నారంగ్ తెలిపారు. ఉదయం వాకింగ్‌కు వెళ్లకపోవడమే మంచిదని సూచించారు.
News January 12, 2026
వరంగల్: విద్యా సంస్థల నిర్మాణం వేగవంతం చేయాలి: భట్టి

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యా సంస్థల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని Dy.సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వరంగల్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సత్య శారద పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని విద్యార్థులను ప్రపంచ స్థాయి పోటీల్లో ముందు వరుసలో నిలబెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు.


