News December 1, 2025

‘ఆర్‌జీ-3 ఏరియాలో నవంబర్‌లో 72% బొగ్గు ఉత్పత్తి’

image

RG-3 ఏరియాలో NOV నెల బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాలు GM నరేంద్ర సుధాకరరావు వెల్లడించారు. 5.70 లక్షల టన్నుల లక్ష్యానికి 4.09 లక్షల టన్నులు (72%) ఉత్పత్తిచేశారు. ఓబీ వెలికితీతలో షవెల్స్ విభాగం 12.50 లక్షల క్యూబిక్ మీటర్ల లక్ష్యానికి 13.11 లక్షల క్యూబిక్ మీటర్లు (105%) సాధించింది. బొగ్గు రవాణా 5.18 లక్షల టన్నులు నమోదైంది. OCP-1 38%, OCP-2 116% ఉత్పత్తి సాధించాయి. లక్ష్య సాధనకు భద్రతతో పని చేయాలన్నారు.

Similar News

News February 16, 2026

కరీంనగర్ మేయర్ పీఠంపై సందిగ్ధత!

image

కరీంనగర్ నగరపాలక సంస్థలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. మేయర్ పీఠం దక్కించుకునేందుకు బీజేపీకి 34 ఓట్ల బలం ఉండగా, కాంగ్రెస్ కూటమికి 35 ఓట్లు ఉన్నట్లు భావించారు. అయితే, అనూహ్యంగా బీఆర్ఎస్ మద్దతు ఉపసంహరించుకున్నట్లు జరుగుతున్న ప్రచారంతో ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ సహకరించని పక్షంలో మేయర్ పీఠం కమలం వశమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

News February 16, 2026

తల్లిపాలు దానం చేయడానికి ఎవరు అర్హులంటే..

image

తల్లిపాలు దానం చేయాలంటే ముందుగా ఆ మహిళకు ఏ రకమైన ఇన్ఫెక్షన్లూ లేవని రక్త పరీక్షల ద్వారా నిర్ధారించాలి. తన బిడ్డకు సంతృప్తికరంగా పాలు తాగించిన తర్వాత, డొనేట్ చేయగలిగినన్ని పాలు కలిగి ఉంటే వాటిని దానం చేయవచ్చు. పొగాకు, డ్రగ్స్, ఆల్కహాల్, ఎక్కువ కెఫీన్ తీసుకొనే అలవాటు ఉన్నవారు తల్లి పాలను దానం చేయడానికి అనర్హులు. HIV, HTLV, హెపటైటిస్ B/ C/ సిఫిలిస్ ఇన్ఫెక్షన్ ఉన్నా బ్రెస్ట్ మిల్క్ డొనేట్ చేయకూడదు.

News February 16, 2026

మేడ్చల్: నేడే పుర పీఠం పోరు..!

image

జిల్లాలోని 3 మున్సిపాలిటీలకు నేడు ఛైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి. MCపల్లిలోని 24 వార్డులకు BRS 14 స్థానాలు గెలిచి పురపీఠాన్ని దక్కించుకోనుంది. ఎల్లంపేటలో 24గాను BRS 12 గెలిచింది. MLA మల్లారెడ్డి ఎక్స్‌అఫిషియో ఓటుతో పురపీఠాన్ని తమ ఖాతాలో వేసుకుందామనుకున్నారు. ఈటల ఎక్స్‌అఫిషియో ఓటుతో కాంగ్రెస్, BJP కలిసి BRSకు చెక్ పెట్టనున్నట్లు సమాచారం. అలియాబాద్‌లో ఏపార్టీకి మెజార్టీ లేకపోవడంతో రసవత్తరంగా మారింది.