News August 14, 2025

ఆర్టీసీకి ‘రాఖీ’ పండుక.. వనపర్తికి అత్యధిక ఆదాయం

image

రాఖీ పౌర్ణమి సందర్భంగా RTC బస్సుల్లో 5 రోజుల్లో (ఆగస్టు 7-11) 26 లక్షల 63 వేల మంది ప్రయాణించారని ఉమ్మడి జిల్లా ఆర్టీసీ రీజినల్ మేనేజర్ పి.సంతోష్ కుమార్ తెలిపారు. గత ఏడాది కంటే 15 వేల మంది ప్రయాణికులు అధికంగా ప్రయాణించారన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వనపర్తి డిపో రూ.2,26,70,000 అధిక ఆదాయం పొందగా.. కోస్గి డిపోకు అతి తక్కువగా రూ. 25,75,000 ఆదాయం వచ్చిందన్నారు.

Similar News

News March 13, 2026

నిర్మల్: IIIT ప్రవేశాలకు నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల

image

IIIT ప్రవేశాలకు నోటిఫికేషన్ షెడ్యూల్‌ను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. 2026-2027 విద్యా సంవత్సరానికి గాను RGUKT బాసర VC గోవర్దన్ నోటిఫికేషన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. RGUKTలో ప్రవేశాలకు సంబంధించిన అప్‌డేట్‌ను అధికారిక వెబ్సైట్ https://www.rgukt.ac.in/ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News March 13, 2026

సంగారెడ్డి జిల్లాలో సిలిండర్ల కొరత సృష్టిస్తే చర్యలు: కలెక్టర్

image

సంగారెడ్డి జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ప్రావీణ్య హెచ్చరించారు. ఎస్పీ పరితోష్ పంకజ్‌తో కలిసి సమీక్షించారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దన్నారు. పట్టణాల్లో 25 రోజులు, గ్రామాల్లో 45 రోజులకు ఒకసారి బుక్ చేసుకునే వీలుందని తెలిపారు. తప్పుడు వార్తలు వ్యాప్తి చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

News March 13, 2026

VKB: పది పరీక్షలకు పకడ్బందీ పోలీస్ బందోబస్తు

image

వికారాబాద్ జిల్లాలో శనివారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 69 పరీక్షా కేంద్రాల వద్ద పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు సెక్షన్ 163 అమలులో ఉంటుందని వెల్లడించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతరం నిఘా ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు.