News December 2, 2025

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

image

AP: RTC ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ముందడుగు పడింది. ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోకి ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు NMUA, ఎంప్లాయీస్ యూనియన్లకు సభ్యత్వం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో జరిగే చర్చల్లో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలూ పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. తమ సమస్యలను నేరుగా ప్రభుత్వానికి వివరించి పరిష్కారాల కోసం చర్చలు జరపవచ్చు.

Similar News

News February 18, 2026

ఫాల్గుణ మాసం: ఈ వ్రతం చేస్తే ఎంతో పుణ్యం

image

ఫాల్గుణ మాసంలో వయో వ్రతాన్ని ఆచరిస్తారు. దీన్నే ‘సర్వయజ్ఞ ఫలప్రదం’ అంటారు. అదితి దేవి తన కుమారులైన దేవతలకు తిరిగి స్వర్గరాజ్యం లభించాలని ఈ వ్రతాన్ని ఆచరించిందట. అలా వామనుడిని పుత్రుడిగా పొందిందని పురాణ గాథ. కోరిన కోరికలు నెరవేరడానికి, సంతాన ప్రాప్తికి, ఐశ్వర్యాన్ని పొందడానికి, కష్టాల నుంచి విముక్తి కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. దీన్ని అన్ని వ్రతాలలోకెల్లా ఉత్తమమైనదిగా పరిగణిస్తారు.

News February 18, 2026

మలైకా ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..

image

50ఏళ్లు దాటినా ఇంకా ఫిట్ & యంగ్‌గా కనిపిస్తుంటారు బాలీవుడ్ నటి మలైకా అరోరా. ఆమె టోన్డ్ బాడీ, ఫ్లాట్ యాబ్స్, గ్లోయింగ్ స్కిన్ చూస్తే యూత్‌ కూడా జలసీ ఫీల్ అవ్వాల్సిందే. దీనికోసం యోగాతో పాటు హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (HIIT) చేస్తానని మలైకా ఓ ఇంటర్వూలో వెల్లడించారు. వీటితో పాటు పైలేట్స్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఫుల్-బాడీ వర్కౌట్‌లతో సహా వివిధ రకాల వ్యాయామాలను చేయడానికి ఇష్టపడతానని తెలిపారు.

News February 18, 2026

సభ ప్రారంభమైన 5 నిమిషాలకే వాయిదా

image

AP: శాసనమండలిలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈరోజు సభ ప్రారంభమైన 5 నిమిషాలకే వాయిదా పడింది. ఇందాపూర్ డెయిరీ అంశంపై చర్చకు డిమాండ్ చేస్తూ వైసీపీ MLCలు నిరసనకు దిగారు. ఆందోళనల మధ్య ఛైర్మన్ సభను రేపటికి వాయిదా వేశారు. వైసీపీ సభ్యులు దేవుడిపై రాజకీయాలు చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారని హోంమంత్రి అనిత విమర్శించగా, ప్రభుత్వమే శ్రీవారిపై రాజకీయాలు చేస్తోందని YCP పక్షనేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.