News November 19, 2025

ఆర్థిక ఇబ్బందులు వృద్ధులను బాధిస్తున్నాయి: కలెక్టర్

image

వయోవృద్ధుల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యం అని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లేనినా ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రస్తుత రోజుల్లో కుటుంబాలు వయోవృద్ధులను నిర్లక్ష్యం చేసే పరిస్థితులు పెరిగిపోతున్నాయని చెప్పారు. వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News January 12, 2026

ఎలక్ట్రిక్ ఆటోలను పంపిణీ చేసిన జేసీ

image

గ్రామాల్లో ఇంటింట చెత్త సేకరణ కోసం అన్నమయ్య జేసీ ఎలక్ట్రిక్ ఆటోలను సోమవారం పంపిణీ చేశారు. స్వచ్ఛ, స్వర్ణ ఆంధ్ర కార్యక్ర మానికి ఆటోలను స్వచ్ఛఆంధ్ర కార్పొరేషన్ మంజూరు చేసిందని జేసీ అన్నారు. 8 ఎలక్ట్రికల్ ఆటోలను జిల్లాకు ప్రతిపాదన చేయగా వాటిని చిన్నమండెం మండల పడమటికోన పంచాయతీ, ఓబులవారిపల్లి మండలంలో ఓబులవారిపల్లికి, వీరబల్లి మండలంలోని ఓడివీడు పంచాయతీలకు పంపిణీ చేశామన్నారు.

News January 12, 2026

తిరుపతి జిల్లాకు అవి రెండు ముప్పే.!

image

తిరుపతి జిల్లాలోని దామలచెరువు, ముంగిలిపుట్టు, బాలిజేపల్లి గ్రామాల్లో భూగర్భ జలాల్లో యురేనియం ఆనవాళ్లు ఉన్నట్లు CGWB నివేదిక పేర్కొంది. ఇదే సమయంలో తీర ప్రాంతాల్లో భూగర్భ జలాలను అధికంగా తోడటం వల్ల సముద్రపు ఉప్పు నీరు భూమిలోకి చొచ్చుకొస్తోందని హెచ్చరించింది. ఈ ‘సీవాటర్ ఇంట్రూజన్’ సమస్య వల్ల తాగునీటి నాణ్యత మరింత దిగజారే ప్రమాదం ఉంది. దీంతో ముందుకెళ్తే నుయ్యి, వెనకెళ్తే గొయ్యి అన్నట్లయింది పరిస్థితి.

News January 12, 2026

సెమీ మెకనైజ్డ్ ఇసుక రీచ్‌లను గుర్తించండి: కలెక్టర్

image

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో 24 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు సెమీ మెకనైజ్డ్ కొత్త ఇసుక రీచ్‌లను గుర్తించాలన్నారు.