News April 2, 2024
ఆర్మూర్ డివిజన్ పరిధిలోని చెక్ పోస్టుల వద్ద తనిఖీలు

నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఆర్మూర్ డివిజన్లో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆర్మూర్ డివిజన్లోని కమ్మర్ పల్లి – అంతర్ జిల్లా చెక్ పోస్ట్, దూద్గాం – అంతర్ జిల్లా చెక్ పోస్ట్, తల్వేదా – అంతర్ జిల్లా చెక్ పోస్ట్, భీంగల్ – SST చెక్ పోస్ట్ పరిధిలో SST& పోలీస్ సిబ్బంది విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలలో సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News February 13, 2026
NZB: బీజేపీ మేయర్ అభ్యర్థి స్రవంతి రెడ్డి విజయం

నిజామాబాద్ నగరంలోని ఆరో డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి గోపిడి స్రవంతి రెడ్డి విజయం సాధించారు. కంఠేశ్వర్ ప్రాంతానికి చెందిన గోపిడి స్రవంతి రెడ్డి బీజేపీ మేయర్ అభ్యర్థిగా ఆరో డివిజన్ నుంచి పోటీ చేశారు. ప్రత్యర్థిపై మెజారిటీతో గెలుపొందారు. తనకు ఓటు వేసి గెలిపించిన వార్డు సభ్యులకు స్రవంతి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
News February 13, 2026
ఆర్మూర్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా

ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 36 వార్డులకు 19 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. స్పష్టమైన మెజారిటీని సాధించడంతో ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్: 19 వార్డులు
బీజేపీ: 7 వార్డులు
బీఆర్ఎస్: 5 వార్డులు
ఇతరులు/స్వతంత్రులు: 4 వార్డులు
MIM: 1
హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గ చూపారు.
News February 13, 2026
BREAKING: బోధన్ మున్సిపాలిటీలో హంగ్

ఉత్కంఠభరితంగా సాగిన బోధన్ మున్సిపాలిటీ కౌంటింగ్‌లో చివరకు హంగ్ ఏర్పడింది. మొత్తం 38 వార్డుల్లో 17 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు జయకేతనం ఎగరవేయగా 12 స్థానాల్లో MIM, BJP 3, BRS 5 స్థానాల్లో గెలిచాయి. ఒక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. మ్యాజిక్ ఫిగర్ సంఖ్య 20కి ఎవరూ చేరుకోకపోవడంతో హంగ్ నెలకొంది.


