News January 11, 2026

ఆర్మేనియాలో సిరిసిల్లవాసి మృతి

image

సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రానికి చెందిన మేకల ప్రవీణ్ (33) యూరప్ దేశమైన ఆర్మేనియాలో మృతి చెందాడు. బతుకుదెరువు కోసం 9 నెలల క్రితం ఆర్మేనియాకు వెళ్లిన ప్రవీణ్.. శుక్రవారం రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా అతడిని ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రవీణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడని తాజాగా కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో ప్రవీణ్ కుటుంబంలో విషాదం నెలకొంది.

Similar News

News January 20, 2026

ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి: హనుమకొండ కలెక్టర్

image

గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు సర్పంచులు కృషి చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలానికి చెందిన నూతనంగా ఎన్నికైన సర్పంచులకు హసన్‌పర్తి ఈటీసీలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. సర్పంచులతో మాట్లాడిన కలెక్టర్ గ్రామాభివృద్ధిలో వారి పాత్ర కీలకమని పేర్కొంటూ పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.

News January 20, 2026

సిరిసిల్ల: ‘వారసత్వంగా కాదు.. అంకితభావంతో లభిస్తాయి’

image

బీజేపీలో పదవులు వారసత్వంగా కాదు.. అంకితభావంతో లభిస్తాయని బీజేపీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికైనందున బీజేపీ కార్యాలయంపై మంగళవారం జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ.. సేవ చేసే వారికి మాత్రమే పట్టం కట్టే ఏకైక పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. శంకర్, తిరుపతి, రాజు, హరీష తదితరులు పాల్గొన్నారు.

News January 20, 2026

విజయనగరం కలెక్టర్‌కు అవార్డు

image

విజయనగరం జిల్లా ఎన్నికల అధికారి రాంసుందర్ రెడ్డి, పూర్వ కలెక్టర్ అంబేడ్కర్ ఉత్తమ ఎన్నికల జిల్లా అవార్డుకు ఎంపికయ్యారు. 2025లో నిర్వహించిన ఎన్నికల్లో అత్యుత్తమ విధానాలను అమలు చేసినందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి వీరి పేరును నామినేట్ చేశారు. జనవరి 25న విజయవాడలో జరగనున్న 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో వీరు ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.