News November 8, 2025
ఆలమూరు: దివంగత ఎస్ఐ అశోక్ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం

ఆలమూరు ఎస్ఐగా పనిచేస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎం. అశోక్ కుమారుడు ఎం. సత్యసాయికిరణ్ నవనీత్‌కు ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది. శుక్రవారం అతనికి రవాణా శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా రావులపాలెం సీఐ విద్యాసాగర్, ఆలమూరు ఎస్ఐ నరేశ్, ఇతర సిబ్బంది సత్యసాయికిరణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ శాఖ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Similar News
News January 23, 2026
‘నైనీ’ బ్లాకులపై కేంద్ర బృందానికి సింగరేణి CMD నివేదిక

TG: కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన ఇద్దరు సభ్యుల బృందం హైదరాబాద్‌లో సింగరేణి CMD కృష్ణ భాస్కర్, ఉన్నతాధికారులతో భేటీ అయ్యింది. నైనీ బొగ్గు బ్లాకు టెండర్ ప్రక్రియ వివరాలను CMD ఆ బృందానికి సమర్పించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత(CSR) కింద వినియోగించిన నిధుల వివరాలనూ అందించాలని బృందం సభ్యులు అధికారులను కోరారు. రెండేళ్లుగా ప్రభుత్వం ‘రాజీవ్ అభయ హస్తం’ పథకానికి ఈ CSR నిధులనే వినియోగిస్తోంది.
News January 23, 2026
కల్లూరు: గ్రీన్ ఫీల్డ్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి

కల్లూరు మండలం లింగాల గ్రామ సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవేపై శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఇంకా ప్రారంభం కాని ఈ రహదారిపై బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుల వివరాల కోసం ఆరా తీస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
News January 23, 2026
సంచలనం.. ట్రంప్ మళ్లీ పోటీ చేస్తారా?

తన మాటలు, చేతలతో వివాదాలు రేపుతున్న ట్రంప్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. ‘నేను నాలుగో సారి పోటీ చేయాలా?’ అని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ‘TRUMP 2028, Yes’ అని రాసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. US రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడిగా 2సార్లు పని చేయడానికే ఛాన్స్ ఉంది. 3సార్లు పోటీ చేసిన ట్రంప్ 2సార్లు గెలిచారు. మరి నాలుగోసారి పోటీకి తమ రాజ్యాంగాన్ని సవరిస్తారా?


