News November 5, 2025
ఆలయాల వద్ద పటిష్ఠ బందోబస్తు: వరంగల్ సీపీ

కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయాల వద్ద పటిష్ఠమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఇటీవల జరిగిన ఘటన దృష్టిలో ఉంచుకుని తోపులాటలు లేకుండా భక్తులు క్యూలైన్లలో కొనసాగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది సాయం తీసుకోవాలని సీపీ పేర్కొన్నారు.
Similar News
News January 24, 2026
దక్షిణ కోస్తా రైల్వే జోన్ నుంచి కేకే లైన్ దూరమవుతోందా?

కొత్తవలస-కిరండోల్ మార్గం దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి నుంచి తప్పిపోయే ప్రమాదం ఏర్పడింది. కేకే లైన్ ద్వారా ఐరన్ ఓర్, బొగ్గు వంటి కార్గో రవాణాతో జోన్‌కు భారీ ఆదాయం లభిస్తోంది. కొత్తవలస జంక్షన్‌తో పాటు శ్రీకాకుళం జిల్లాలో పలు సెక్షన్లు రాయగడ డివిజన్‌కు వెళ్లే పరిస్థితి తలెత్తుతోంది. రైల్వేలో ఉత్తరాంధ్రపై ఒడిశా ఆధిపత్యం కొనసాగుతుండగా.. ఈ మార్గం కోల్పోతే జోన్ ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం పడుతుంది.
News January 24, 2026
అరుణోదయ స్నానం ఎలా చేయాలంటే?

సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. తూర్పు ముఖంగా నదిలో నిలబడి తలపై ఒకటి, భుజాలు, మోచేతులు, మోకాళ్లపై 2 చొప్పున మొత్తం 7 జిల్లేడు ఆకులను, వాటిపై రేగుపళ్లను ఉంచి స్నానం చేయాలి. అలాగే సూర్య మంత్రాలు పఠించాలి. నెత్తిన రేగుపళ్లు పోసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. స్నానానంతరం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. తద్వారా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, గత జన్మ పాపాలు నశిస్తాయని నమ్మకం.
News January 24, 2026
అన్నమయ్య: కుక్కల దాడిలో జీవాలు మృతి

కురబలకోట(M) నందిరెడ్డిగారిపల్లెకు చెందిన మస్తాన్ 50 గొర్రెలను గురువారం రాత్రి ఇంటి వద్దే దొడ్డిలో తోలారు. శుక్రవారం ఉదయం చూడగా 9 గొర్రెలు మృతి చెందాయి. అక్కడే ఉన్న కుక్కలను గమనించి దాడి చేసి చంపేసినట్లు గుర్తించారు. పశు వైద్యాధికారి నవీన్ కుమార్ సిబ్బందితో కలసి గొర్రెలను పరిశీలించారు. వీధి కుక్కల బెడద ఎక్కువగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మరి మీ ప్రాంతంలో కూడా కుక్కల బెడద ఉందా? కామెంట్


