News April 20, 2024
ఆలోచన, అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట: సిరిసిల్ల ఎస్పీ

అప్రమత్తత, ఆలోచన, అవగాహనలతో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయగలమని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో శనివారం ప్రకటన విడుదల చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతోనే ప్రజలు మోసపోతున్నారని ఆయన స్పష్టం చేశారు. తమ మొబైల్ ఫోన్లకు వచ్చే తెలియని మెసేజులు, లింకులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Similar News
News December 15, 2025
రామడుగు హరీష్‌కు ‘ఒక్క’ ఓటు అదృష్టం!

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దూరుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి రామడుగు హరీష్ సంచలన విజయం సాధించారు. ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన హరీష్‌పై అందరి దృష్టి పడింది. ఆయన తన సమీప ప్రత్యర్థిపై కేవలం ఒక్కే ఒక్క ఓటు మెజారిటీతో గెలుపొందడం విశేషం. ఒక ఓటుతో గెలుపొందడం తన అదృష్టంగా భావిస్తున్నానని హరీష్ తెలిపారు.
News December 14, 2025
ముంజంపెల్లి: ఒక్క ఓటు మెజారిటీతో సర్పంచ్‌గా గెలుపు

మానకొండూర్ మండలం ముంజంపెల్లి సర్పంచ్ ఎన్నికలో ఉత్కంఠ నెలకొంది. నందగిరి కనక లక్ష్మి (INC) ఒక్క ఓటు మెజారిటీతో విజయం సాధించారు. తొలి లెక్కింపులో ఆమెకు 878 ఓట్లు రాగా, సమీప అభ్యర్థి వెలుపు గొండ కొమురమ్మ (BRS)కు 877 ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్ తర్వాత కూడా కనక లక్ష్మికే 1 ఓటు ఆధిక్యం రావడంతో ఆమెను విజేతగా ప్రకటించారు.
News December 14, 2025
మహాత్మనగర్‌లో ఒక్క ఓటుతో సంపత్ విజయం

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మనగర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి పొన్నాల సంపత్ సంచలన విజయం నమోదు చేశారు. కేవలం ఒక్క ఓటు మెజారిటీతో సంపత్ సర్పంచ్‌గా గెలుపొందారు. ఈ స్వల్ప తేడాతో గెలవడంతో గ్రామంలో ఉత్కంఠ నెలకొంది. సంపత్‌కు గ్రామ ప్రజలు, అభిమానులు అభినందనలు తెలిపారు. తన గెలుపునకు సహకరించిన గ్రామ ప్రజలకు సంపత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


