News September 12, 2025

ఆసిఫాబాద్‌: అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

image

జిల్లాలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి ఆయన వీసీ ద్వారా ఎంపీడీవోలు, ఉపాధి హామీ, హౌసింగ్, ఏపీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన తాగునీటి సరఫరా, మొక్కల పెంపకం, మౌలిక వసతుల పనులపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Similar News

News December 7, 2025

ఈ లక్షణాలు కనిపిస్తే విటమిన్ B12 లోపం ఉన్నట్టే!

image

* పాదాలు తిమ్మిరిగా లేదా మండుతున్నట్టుగా అనిపిస్తుంది
* ఉన్నట్టుండి బాడీకి షాక్ కొట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది.
* పని మీద శ్రద్ధ పెట్టలేక ఇబ్బంది పడతారు.
* అన్ని సమయాలలోనూ అలసిపోయిన భావన కలుగుతుంది.
* చిన్న విషయాలను కూడా పదే పదే మర్చిపోతుంటారు.
* మెట్లు ఎక్కేటప్పుడు కాళ్లు బలహీనంగా అనిపిస్తాయి.

News December 7, 2025

రేపు ‘నన్నయ్య’కు మాజీ ఉపరాష్ట్రపతి

image

ఆదికవి నన్నయ వర్సిటీలో 8, 9 తేదీల్లో “భారతీయ భాషలలో ఏకరూప శాస్త్రీయ సాంకేతిక పదజాలం”పై జాతీయ కార్యశాల జరగనుంది. కేంద్ర విద్యాశాఖ, భారతీయ భాషా సమితి సహకారంతో నిర్వహించే ఈ సదస్సుకు మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. శాస్త్రీయ పదజాలాన్ని ప్రాంతీయ భాషల్లోకి సులభతరం చేసే లక్ష్యంతో ఈ ప్రతిష్టాత్మక సదస్సు నిర్వహిస్తున్నట్లు వివరించారు.

News December 7, 2025

గద్వాల్: 16 హామీలతో మ్యానిఫెస్టో

image

ధరూర్ మండలం రేవులపల్లి సర్పంచ్ అభ్యర్థి శృతి 16 హామీలతో ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు. నిలిచిన బృందావన గార్డెన్, స్కూల్ భవనం పూర్తి, కొత్త R&R సెంటర్‌లో మౌలిక వసతుల కల్పన లక్ష్యమన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, జెనో కో ఫ్రీ కరెంట్ ZPHSలో ఇంగ్లిష్ మీడియం టీచర్లను ఏర్పాటు చేస్తానన్నారు. అకాలంగా మరణించిన వారికి పంచాయతీ తరఫున రూ.5000 ఆర్థిక సాయం అందిస్తానన్నారు. కత్తెర గుర్తుకు ఓటు వేయాలన్నారు.