News August 13, 2025
ఆసిఫాబాద్: ‘అర్హులకు రుణ సదుపాయం కల్పించాలి’

జిల్లాలోని వ్యవసాయ, స్వయం సహాయక సంఘాలు, ఇతర రంగాల అభివృద్ధి కోసం అర్హులైన లబ్ధిదారులకు రుణ సదుపాయం కల్పించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం చేతన్ గోరేకర్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్‌తో కలిసి జిల్లా స్థాయి త్రైమాసిక కమిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రుణాలపై చర్చించారు.
Similar News
News March 13, 2026
మరిపెడలో యువకుడి ఆత్మహత్య

మరిపెడ పట్టణంలో బానోత్ సాయి (23) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం తుమ్మలతండాకు చెందిన సాయి, మరిపెడలోని ఓ మిర్చి ఫ్యాక్టరీలో పనిచేస్తూ తన స్నేహితుడితో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 13, 2026
సిరిసిల్ల: రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు

జిల్లాలో మార్చి 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల కోసం 34 కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ గరిమా అగ్రవాల్ శుక్రవారం తెలిపారు. మొత్తం 7,317 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా అందులో 3,511 మంది బాలురు, 3,806 మంది బాలికలు ఉన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు అరగంట ముందే చేరుకోవాలని సూచించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ జిరాక్స్ దుకాణాలు మూసివేయనున్నారు.
News March 13, 2026
గ్యాస్ కొరతపై అపోహలు వద్దు: కలెక్టర్, ఎస్పీ

మహబూబాబాద్ జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ కొరత ఉందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కలెక్టర్ స్నేహ శబరీశ్, ఎస్పీ శబరీశ్ స్పష్టం చేశారు. జిల్లాలోని 11 ఏజెన్సీల పరిధిలో 2,12,131 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, వారం రోజుల్లోనే 13,985 సిలిండర్లను పంపిణీ చేశామని వివరించారు. సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి అపోహలు నమ్మవద్దని వారు కోరారు.


