News October 5, 2025
ఆసిఫాబాద్: ఎన్నికల పోరుకు BRS, కాంగ్రెస్, BJP రెడీ!

ఆసిఫాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. ఈనెల 9వ తేదీ నుంచి మొదటి విడత ఎన్నికలకు నామపత్రాలు దాఖలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక, కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు ప్రధాన పార్టీలు సమావేశాల నిర్వహణలో తలమునకలై ఉన్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, BRS, BJP తమ తమ సామర్థ్యాలను నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Similar News
News January 20, 2026
HYDలో ఫేక్ ట్రాఫిక్ చలాన్ల కలకలం: జాగ్రత్త!

HYDలో నకిలీ ట్రాఫిక్ చలాన్ల మోసాలు పెరుగుతుండటంపై పోలీసులు ప్రజలను హెచ్చరించారు. అధికారిక వెబ్‌సైట్‌ను పోలి ఉండే ఫిషింగ్ లింక్‌లను నిందితులు SMS ద్వారా పంపుతున్నారు. ఆ లింక్‌లను క్లిక్ చేసి వివరాలు నమోదు చేయగానే బాధితుల బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. ప్రభుత్వ సైట్లు ఎల్లప్పుడూ .gov.in లేదా .orgతో ముగుస్తాయని, SMS లింక్‌ల ద్వారా చెల్లింపులు చేయొద్దని అధికారులు సూచించారు.
News January 20, 2026
వరంగల్: SBI ఏటీఎంలో చోరీ.. నిందితుల ARREST

వరంగల్ పరిధి శంభునిపేట SBI ఏటీఎంలో జరిగిన దొంగతనం కేసులో నిందితులు యూపీకి చెందిన వినయ్ కుమార్, వినీత్ కుమార్‌ను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.1.27 లక్షల నగదు, రెండు మొబైల్స్, ఒక వీసా ఏటీఎం కార్డు స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ ఏఎస్పీ శుభం ప్రకాశ్ తెలిపారు. మంగళవారం మట్వాడ ఏఎస్పీ ఆఫీస్‌లో నిందితులను మీడియాకు చూపారు. కాజీపేటకు చెందిన కాళేశ్వరవు వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసును ఛేదించామన్నారు.
News January 20, 2026
నైనీ కోల్ టెండర్లపై CBIతో విచారించాలి: రాంచందర్

TG: నైనీ కోల్ బ్లాక్ టెండర్ల వివాదంతో CM, మంత్రుల విభేదాలు బట్టబయలయ్యాయని TBJP చీఫ్ రాంచందర్ రావు విమర్శించారు. ‘బంధువులకు గనులు కేటాయించుకోవాలని చూశారు. మీడియాలో వార్తలతో టెండర్లు రద్దు చేశారు. దీనిపై CBI, మరేదైన సంస్థతో విచారించాలి’ అని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసే అర్హత BRSకు లేదన్నారు. BRS హయాం నుంచి ఇప్పటి INC GOVT వరకు జరిగిన అవినీతిపై విచారణ జరగాలని పేర్కొన్నారు.


