News March 14, 2025

ఆసిఫాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్

image

ఉమ్మడి జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరగడంతో ఆసిఫాబాద్ జిల్లాకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం ఆదిలాబాద్‌లో 40డిగ్రీలు, ఆసిఫాబాద్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా రానున్న రెండు మూడు రోజుల్లో ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు. చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Similar News

News February 18, 2026

ADB: బ్రిడ్జి కోర్సు ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు

image

ఐటీఐ 2 సంవత్సరాల కోర్సులో పాసైన విద్యార్థుల నుంచి పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలోకి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ పీ.శ్రీనివాస్ తెలిపారు. ఫిబ్రవరి 21లోపు సర్టిఫికెట్‌లతో కళాశాలలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 60% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. బ్రిడ్జి కోర్సు ప్రవేశ పరీక్ష మార్చి 12న ఉంటుందన్నారు.

News February 18, 2026

వరంగల్ నిట్ ప్రాజెక్ట్ డిజైన్‌కు భారతీయ పేటెంట్

image

నిట్ వరంగల్ మెకానికల్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్లు జి.రాఘవేంద్ర, వి.సురేష్ బాబు, బీటెక్ విద్యార్థి వలబోజు సాయి కార్తీక్ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రాజెక్టు డిజైన్‌కు పేటెంట్ లభించింది. “స్మార్ట్ ఫంక్షనల్లీ గ్రేడెడ్ మెటీరియల్” అనే డిజైన్‌ను భారత ప్రభుత్వ పేటెంట్ కార్యాలయం నమోదు చేసింది. ​ఇది ఆవిష్కరణ, పరిశోధనా ప్రతిభకు నిదర్శనంగా నిలిచిందంటూ నిట్ అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

News February 18, 2026

సంగారెడ్డి: ఓటర్ల సర్వేలో వేగం పెంచాలి: కలెక్టర్

image

సంగారెడ్డి జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 51.96 శాతం సర్వే మాత్రమే పూర్తయిందని, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పురోగతి తక్కువగా ఉందన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల జాబితా సవరణను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.