News September 10, 2025
ఆసిఫాబాద్: ‘జిల్లాలో ఇసుక లభ్యతపై నివేదికలు రూపొందించాలి’

ఆసిఫాబాద్ జిల్లాలో ఇసుక లభ్యతపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఉన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి ఇసుక లభ్యతపై రెవెన్యూ, గనులు భూగర్భ, నీటి పారుదల, నీటి వనరుల, అటవీ, రోడ్లు భవనాల శాఖల అధికారులతో కమిటీ సమావేశం నిర్వహించారు.
Similar News
News December 17, 2025
MLAలకు స్పీకర్ క్లీన్‌చిట్.. నెక్స్ట్ ఏంటి?

TG: పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ ప్రసాద్ ఐదుగురు <<18592868>>MLA<<>>ల వాదనలతో ఏకీభవించారు. తాము ముఖ్యమంత్రిని కలిసిన మాట నిజమేనని కానీ పార్టీ మారలేదని, కండువా కప్పుకోలేదని వారు స్పష్టం చేశారు. నిధుల కోసం CMను కలవడంలో తప్పు లేదని వాదించారు. దీంతో వారు పార్టీ మారినట్లు BRS చేసిన ఆరోపణలను స్పీకర్ కొట్టేశారు. ఫలితంగా వారు MLAలుగా కొనసాగనున్నారు. ఇదే విషయాన్ని రేపు అసెంబ్లీ కార్యదర్శి సుప్రీంకోర్టుకు తెలపనున్నారు.
News December 17, 2025
కరీంనగర్ జిల్లాలో 86.42% పోలింగ్ నమోదు

కరీంనగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 5 మండలాల్లో తుది పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించారు. మొత్తం 86.42% పోలింగ్ కాగా, ఇల్లందకుంటలో 87.05%, హుజూరాబాద్ లో 85.94%, జమ్మికుంటలో 85.72%, వీణవంకలో 85.87%, సైదాపూర్ లో 87.85% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. మొత్తం 111 గ్రామ పంచాయితీల్లో 165046 ఓట్లకు గాను 142637 ఓట్లు పోలయ్యాయి.
News December 17, 2025
రూపాయి పతనమైతే సామాన్యుడికి ఏంటి సమస్య?

రూపాయి విలువ పడిపోతే తమపై ఏ ప్రభావం ఉండదని సామాన్యులు అనుకుంటారు. ప్రత్యక్షంగా లేకున్నా ఎగుమతి, దిగుమతుల ఖర్చులు పెరగడంతో మందులు, ఎలక్ట్రానిక్స్, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయడానికి RBI వడ్డీ రేట్లు పెంచితే లోన్ల EMIలు పెరుగుతాయి. కంపెనీల ఖర్చులు పెరగడంతో ఇంక్రిమెంట్లపై ప్రభావం పడుతుంది. రిక్రూట్‌మెంట్లు తగ్గుతాయి. బోనస్, వేరియబుల్ పే తగ్గే ఛాన్స్ ఉంది.


