News February 26, 2025
ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్నికల సామగ్రి పంపిణీ

ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, పకడ్బందీగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశామని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే తెలిపారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. మొత్తం జిల్లాలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 17 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఆయా కేంద్రాల వద్దకు ఎన్నికల సామగ్రి తరలిస్తున్నట్లు వెల్లడించారు.మొత్తం 6వేల 607 మంది ఓటర్లు ఉన్నారు.
Similar News
News February 27, 2025
నేడు SLBC టన్నెల్‌కు BRS బృందం

TG: ప్రమాదం జరిగిన SLBC టన్నెల్ వద్దకు ఇవాళ బీఆర్ఎస్ బృందం వెళ్లనుంది. మాజీ మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల నాయకులు HYDలోని తెలంగాణ భవన్ నుంచి భారీ కాన్వాయ్‌తో ర్యాలీగా వెళ్లనున్నారు. అయితే తమను పోలీసులు అడ్డుకోవద్దని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సహాయ చర్యలకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే ఇన్నిరోజులు తాము అక్కడికి వెళ్లలేదని తెలిపారు.
News February 27, 2025
ఆడపిల్లలను అక్కున చేర్చుకున్న చిత్తూరు కలెక్టర్

గంగాధర నెల్లూరులోని ఓ దంపతులకు రక్షిత, హేమశ్రీ అనే ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. కొన్ని అనివార్య కారణాలతో తల్లిదండ్రులు విడిపోయి వారి జీవితాలను మరొకరితో పంచుకున్నారు. ఈ కారణంగా అనాథలైన రక్షిత, హేమశ్రీ బాగోగులు వారి తాతయ్య చూసుకుంటున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న కలెక్టర్ సుమిత్ కుమార్.. ఇద్దరి పిల్లల ఉన్నత విద్య బాధ్యత తానే తీసుకున్నట్లు ప్రకటించారు. దీంతో పలువురు కలెక్టర్‌ను అభినందిస్తున్నారు.
News February 27, 2025
ఎచ్చెర్ల : ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య

విజయనగరంలో ఎచ్చెర్లకు చెందిన విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న లోకేశ్ స్థానిక బొడ్డువారి జంక్షన్‌లో ఫ్రెండ్స్‌తో ఉంటున్నాడు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్నయ్య గణేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.