News September 12, 2025

ఆసిఫాబాద్ జిల్లాలో ఎస్ఐల బదిలీలు

image

ఆసిఫాబాద్ జిల్లాలో పలువురు SIలను బదిలీ చేస్తూ రామగుండం CP ఉత్తర్వులు జారీ చేశారు. SI-II, సిర్పూర్-T PD Att. కాగజ్‌నగర్-టి PSలో విధులు నిర్వహిస్తున్న సురేష్‌ను సిర్పూర్-T PSకు, సిర్పూర్-T SI ఎం.కమలాకర్‌ను VR KBM ఆసిఫాబాద్‌కు, VR, KBM ఆసిఫాబాద్‌లో ఉన్న డి.చంద్రశేఖర్‌ను కౌటాలకు, కౌటాలలో విధులు నిర్వహిస్తున్న జి.విజయ్‌ను VR కల్పించారు.

Similar News

News December 17, 2025

నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ పూర్తి చేయండి: MP

image

నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ పూర్తి చేయాలని భారత రైల్వే బోర్డు ఛైర్మన్ సంతోశ్ కుమార్‌ను ఢిల్లీలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. బుధవారం ఆయన్ను MP మర్యాదపూర్వకంగా కలిశారు. బిట్రగుంట అభివృధ్ధి, ROB, RUBల పూర్తి, వివిధ ప్రాంతాల్లో ప్రధాన ట్రైన్లకు హాల్టింగ్ ఏర్పాటుపై చర్చించారు. జిల్లాలో రైల్వే పరిధిలో పెండింగ్లో ఉన్న అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు.

News December 17, 2025

నాగర్‌కర్నూల్‌లో 83.1 శాతం పోలింగ్‌

image

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ఉత్సాహంగా ముగిశాయి. జిల్లావ్యాప్తంగా 83.1 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 1,79,464 మంది ఓటర్లకు గాను 1,49,222 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అచ్చంపేట, ఉప్పునుంతల, చారకొండ మండలాల్లో భారీగా ఓటింగ్ జరగ్గా, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం 1 గంటకే 77.82 శాతం పోలింగ్‌ పూర్తి కావడం విశేషం.

News December 17, 2025

వీర్నపల్లి సర్పంచ్‌గా జ్యోత్స్న విక్టరీ

image

వీర్నపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా మల్లారపు జ్యోత్స్న అరుణ్ కుమార్ విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన సమీప అభ్యర్థి భూత భాగ్యలక్ష్మీపై జ్యోత్స్న గెలుపొందారు. బరిలో ఏడుగురు పోటీపడగా 205 ఓట్ల తేడాతో గెలిచారు. ఈ సందర్భంగా జ్యోత్స్న మాట్లాడుతూ.. ఈ గెలుపును తన వ్యక్తిగత విజయంగా కాకుండా గ్రామప్రజలందరి విజయంగా భావిస్తున్నానన్నారు. తనపై నమ్మకం ఉంచి ఆదరించిన గ్రామస్థులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.