News December 1, 2025
ఆసిఫాబాద్ జిల్లాలో నిలిచిన మీసేవ సేవలు

జిల్లాలోని మీసేవ కేంద్రాల్లో రెండు రోజులుగా సర్వర్ పనిచేయకపోవడంతో పౌర సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం కేంద్రాలకు వచ్చిన లబ్ధిదారులు గంటల తరబడి వేచి ఉండి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా స్థానిక ఎన్నికలు, విద్యా సంబంధిత అవసరాల కోసం వచ్చిన వారు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే సర్వర్ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News February 13, 2026
కవితకు షాక్.. మాకు జాగృతికి సంబంధం లేదు: వడ్డేపల్లి శ్రీనివాస్

TG: జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో తమ అభ్యర్థులు గెలిచి ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారని చెప్పిన జాగృతి చీఫ్ కవితకు షాక్ తగిలింది. తమకు జాగృతి సంస్థతో సంబంధమే లేదని ఇక్కడ విజయం సాధించిన ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి వడ్డేపల్లి శ్రీనివాస్ చెప్పారు. అసలు తాము కవిత జాగృతి సంస్థలో చేరలేదని, ఫార్వర్డ్ బ్లాక్ నుంచే పోటీ చేసి గెలిచామని ఛైర్మన్ అభ్యర్థిగా ఉన్న శ్రీనివాస్ స్పష్టం చేశారు.
News February 13, 2026
మహా శివరాత్రి ప్రత్యేక రుద్రహోమం

గ్రహ, దృష్టి దోషాలతో బాధ పడుతున్నారా? అనారోగ్యం వేధిస్తోందా? అయితే మహా శివరాత్రి నాడు చేసే రుద్ర హోమం మీకు వీటి నుంచి విముక్తి కలిగిస్తుంది. ఈ పూజ ద్వారా మీ శారీరిక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. కెరీర్‌లో ఆటంకాలు లేకుండా ముందుకు సాగవచ్చు. గణపతి పూజ, కుంభ స్థాపన, నవగ్రహ స్థాపనతో నిర్వహించే ఈ పూజ పూర్తి వీడియో రికార్డింగ్‌ను మీకు పంపుతాం. పేరు, గోత్రంతో వేదమందిర్‌లో ఇప్పుడే <
News February 13, 2026
విజయ్-రష్మిక పెళ్లి వీడియో స్ట్రీమింగ్‌కు ₹60 కోట్ల ఆఫర్?

టాలీవుడ్ క్రేజీ యాక్టర్స్ విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి ఈ నెల 26న జరగనుందని SMలో జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా వీరి మ్యారేజ్‌కు సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. పెళ్లి వీడియో స్ట్రీమింగ్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా ₹60 కోట్లు ఆఫర్ చేయగా.. ఈ జంట నో చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో నయనతార, విఘ్నేశ్ పెళ్లి డాక్యుమెంటరీకి ఇదే OTT ప్లాట్‌ఫామ్ ₹25 కోట్లు చెల్లించగా వివాదమైంది.


