News March 20, 2024

ఆసిఫాబాద్: పోక్సో కేసులో ఒకరికి జీవీతఖైదు

image

కాగజ్‌నగర్ మండలం భట్టుపెల్లికి చెందిన రమేశ్‌కుమార్ అదే గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలికను మే8, 2023న అత్యచారం చేశాడు. కుటుంబీకులు అదేరోజు కాగజ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేశారు. మంగళవారం 14 మంది సాక్షులను విచారించిన న్యాయమూర్తి నిందితుడికి జీవితఖైదు, రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

Similar News

News December 14, 2025

విజయోత్సవ ర్యాలీలు వద్దు: అదనపు ఎస్పీ

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని అదనపు ఎస్పీ కాజల్ సింగ్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే 30 పోలీస్ యాక్ట్, 223 బీఎన్ఎస్ ఆక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అధికారుల అనుమతితో, నిర్దేశించిన రోజున మాత్రమే ర్యాలీలు నిర్వహించాలన్నారు. ప్రస్తుతం బేల, జైనథ్, భీంపూర్, తాంకో, ఆదిలాబాద్(రూ), మావల మండలాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది.

News December 14, 2025

ఆదిలాబాద్ జిల్లాలో తొలి ఫలితం

image

సాత్నాల మండలంలోని సాంగ్వి (జి) గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఆత్రం నగేశ్ గెలుపొందారు. ప్రత్యర్థిపై 389 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సర్పంచ్ నగేశ్‌ను పలువురు అభినందించారు.

News December 14, 2025

83.80 శాతం పోలింగ్ నమోదు

image

జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. 8 మండలాల్లో 139 పంచాయతీల్లో ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయింది. పోలింగ్ సమయం ఒంటి గంట ముగిసే సరికి 83.80 శాతం పోలింగ్ నమోదు అయిందని అధికార వర్గాలు వెల్లడించారు. ఆయా మండలాల్లో ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచారు.