News September 9, 2025
ఆసిఫాబాద్: పోరాటంతోనే ఆదివాసీ గిరిజన సమస్యల పరిష్కారం: TAGS

తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఆసిఫాబాద్ జిల్లా TAGS కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ.. జిల్లాలో జీవో 49 రద్దు చేయాలని కోరుతూ 91 గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించామన్నారు. జిల్లాలోని ఆదివాసులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై పోరాటాలు చేశామని సమావేశంలో తెలిపారు.
Similar News
News December 10, 2025
చిత్తూరు: 9మంది ట్రైనీ ఎస్ఐలకు పోస్టింగ్

చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న 9మంది ప్రొబేషనరీ(ట్రైనీ) ఎస్ఐలకు పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలు జారీ చేశారు. మణికంఠేశ్వర రెడ్డి-NR పేట, చందన ప్రియ- బైరెడ్డిపల్లి, మధుసూదన్- రొంపిచర్ల, జయశ్రీ- ఐరాల, మారెప్ప- పంజాని, అశోక్ కుమార్ నాయక్- చిత్తూరు తాలూకా, రమేష్- సోమల, మల్లికార్జున-నిండ్ర, తేజస్విని- కార్వేటినగరంలో బాధ్యతలు స్వీకరించనున్నారు.
News December 10, 2025
పోలికపాడు పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గోపాల్‌పేట్ మండలంలోని పోలికపాడు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ సునీత రెడ్డి పరిశీలించారు. ఎన్నికలు శాంతియుతంగా జరగేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నికల నియమావళిని అతిక్రమించినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగేందుకు అభ్యర్థులు, రాజకీయ నాయకులు, ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.
News December 10, 2025
వనపర్తి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు: కలెక్టర్

మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను వెబ్ క్యాస్టింగ్ ద్వారా పర్యవేక్షించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. అధికారులతో కలిసి కంట్రోల్ రూమ్‌ను సందర్శించి ఆయన పరిశీలించారు. గురువారం జరగబోయే మొదటి విడత ఎన్నికల పోలింగ్ ప్రక్రియను కంట్రోల్ రూమ్ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు.


