News November 16, 2025
ఆసిఫాబాద్: ప్రత్యేక లోక్ అదాలత్‌లో 842 కేసులు పరిష్కారం

కక్షిదారులు రాజీమార్గంలో కేసులు పరిష్కరించుకుని డబ్బు, సమయం ఆదా చేసుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.వీ రమేష్ సూచించారు. శనివారం ఆసిఫాబాద్‌లోని న్యాయస్థానంలో జరిగిన ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా వివిధ కోర్టుల్లోని 842 కేసులు పరిష్కారం అయ్యాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి యువరాజ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అనంతలక్ష్మి పాల్గొన్నారు.
Similar News
News January 16, 2026
అల్లూరి: రూ.3 వేలు పలికిన ‘కోస’

కనుమ పండుగ రోజున జిల్లాలో కోడి పుంజు కోసకు విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. పందెంలో ఓడిపోయిన కోడి (కోస) కోసం జనాలు ఎగబడ్డారు. జీడీపప్పు, బాదం, పిస్తాల మేతతో పెంచిన ఈ కోడి రుచే వేరని అంటున్నారు. 2 కిలోల కోడి రూ.3వేలు వరకు పలుకుతుందని పలువురు అంటున్నారు. గత ఏడాది రూ.1500 ఉండేదని తెలిపారు.
News January 16, 2026
SUPER.. నిజామాబాద్‌కి FIRST RANK

ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో మన నిజామాబాద్ జిల్లా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాతి స్థానంలో నల్గొండ జిల్లా ఉంది. 6.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి నిజామాబాద్ తొలి స్థానంలో నిలవగా 5.23 లక్షల MTల ధాన్యం సేకరణతో నల్గొండ సెకండ్ ప్లేస్ దక్కించుకుంది. కాగా ఇక్కడ అమ్మకాలు చేసిన రైతులకు పౌరసరఫరాల శాఖ 7రోజుల్లోనే డబ్బును ఖాతాల్లో జమ చేయడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం అమ్మలేదు.
News January 16, 2026
కేసీఆర్ పాలనలో ఆదిలాబాద్ అభివృద్ధి కాలేదు: సీఎం

TG: బాసర ట్రిపుల్ ఐటీలో కొత్త యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. ‘ఆదిలాబాద్ జిల్లా పోరాటాలకు పురిటిగడ్డ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కావాల్సినంత అభివృద్ధి జరగలేదు. కేసీఆర్ అనుకుంటే పదేళ్ల పాలనలో అభివృద్ధి చెంది ఉండేది. పాలమూరు జిల్లాతో పాటు సమానంగా నిధులు ఇస్తా. నిర్మల్‌కు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్, కొత్త స్టేడియం మంజూరు చేస్తాం’ అని నిర్మల్ సభలో ప్రకటించారు.


