News September 9, 2025

ఆసిఫాబాద్: ‘రహదారి ప్రమాదాల నివారణకు కృషి చేయాలి’

image

ఆసిఫాబాద్ జిల్లాలో రహదారులపై ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఎస్పీ కాంతిలాల్ సుభాష్‌తో కలిసి రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, జిల్లా రవాణా శాఖ, విద్యుత్, ఆర్టీసీ, మున్సిపాలిటీ ఇతర శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.

Similar News

News December 13, 2025

MBNR: గెలుపు కోసం.. గౌను ధరించాడు..!

image

మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం శేరివెంకటాపూర్ 1వ వార్డు అభ్యర్థి నారాయణగౌడ్ తన ఎన్నికల గుర్తు ‘గౌను’ను ప్రచారం కోసం వినూత్నంగా ఉపయోగించారు. గుర్తు అందరికీ గుర్తుండాలనే ఉద్దేశంతో ఆయన గౌను ధరించి తమ వార్డులో ప్రచారం నిర్వహించారు. అభ్యర్థి ఈ ప్రచార పద్ధతి స్థానికంగా ప్రత్యేకతను సంతరించుకుంది. నారాయణ గౌడ్ ప్రచారం చేస్తుంటే ప్రజలు ఆసక్తిగా చూశారు.

News December 13, 2025

IHFMS టెండర్లలో భారీగా అవకతవకలు!

image

రాష్ట్రంలోని ప్రభుత్వ టీచింగ్, మెడికల్ కాలేజీల్లో శానిటేషన్, పేషెంట్ కేర్ సేవలను మెరుగుపరిచేందుకు తెచ్చిన నూతన పాలసీకి కాంట్రాక్టర్లు అడ్డంకిగా మారారు. 2024లో కాంట్రాక్టు అసోసియేషన్ కోర్టుకు వెళ్లగా, ప్రభుత్వం నేటికీ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక ప్రతీ కాంట్రాక్టర్ నెలకు లక్షల ఆదాయం పొందుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

News December 13, 2025

నిర్మల్: మంత్రాల నేపంతో హత్య చేసి.. కాల్చేశారు..!

image

మంత్రాల నేపంతో వ్యక్తిని హత్య చేసి కాల్చి బూడిద చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖానాపూర్ CI అజయ్ ప్రకారం.. కడెం మం. గండిగోపాల్పూర్‌కు చెందిన దేశినేని భీమయ్య(55)ను అదే గ్రామానికి చెందిన నరేశ్, మల్లేశ్ ఈనెల 10న భీమయ్యాను కర్రలతో కొట్టి హత్య చేశారు. అనంతరం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి కాల్చి బూడిద చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని కేసు నమోదు చేశారు.