News September 12, 2025

ఆసిఫాబాద్‌: ‘విద్యార్థుల వివరాలు నమోదు చేయాలి’

image

జూనియర్ కళాశాలల విద్యార్థుల వివరాలను యూ డైస్ పోర్టల్‌లో వెంటనే నమోదు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపళ్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల వివరాల నమోదు, ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్‌ఎస్)పై ఆయన సమీక్షించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చూడాలని సూచించారు.

Similar News

News December 9, 2025

NIT వరంగల్‌లో 45పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

<>NIT<<>> వరంగల్ 45 ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తు గడవును పొడిగించింది. అప్లైకి DEC 12 ఆఖరు తేదీ కాగా.. DEC 31వరకు పొడిగించారు. పోస్టును బట్టి PhD, ME, ఎంటెక్, MSc, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.2000, SC, ST, PwDలకు రూ.1000. వెబ్‌సైట్: https://nitw.ac.in/faculty

News December 9, 2025

IndiGo: నెట్‌వర్క్ పునరుద్ధరణ.. నేడు 250 సర్వీసులు రద్దు!

image

ఇండిగో సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. తాజాగా నెట్‌వర్క్‌ను పూర్తిగా పునరుద్ధరించినట్లు సంస్థ ప్రకటించింది. అయినా దేశవ్యాప్తంగా నేడు 250కిపైగా సర్వీసులు రద్దు అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రయాణికుల ఖాతాల్లో రూ.827 కోట్లు రీఫండ్ చేసినట్లు పేర్కొంది. గోవా, అహ్మదాబాద్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. అటు తెలుగు రాష్ట్రాల్లోని HYD, విశాఖలో ఇవాళ పలు సర్వీసులు రద్దయ్యాయి.

News December 9, 2025

కొత్తగూడెం: ‘హామీలు అమలు చేయకపోతే రాజీనామా’

image

గెలిపించిన మూడేళ్లలో హామీలు అమలు చేయకపోతే రాజీనామా చేస్తానని టేకులపల్లి మండలం కొత్తతండాలో సర్పంచ్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థి భూక్యా గీత బాండ్ పేపర్ రాసిచ్చారు. మినరల్ వాటర్ ప్లాంట్, లైబ్రరీ, ఓపెన్ జిమ్, ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి, ఆడబిడ్డ పెళ్లికి రూ.10వేలు, ముత్యాలమ్మ గుడి వరకు రోడ్డు ఏర్పాటు, ఎవరైనా అకాలంగా మరణిస్తే రూ.10వేలు ఇస్తానని బాండ్ పేపర్‌లో ప్రస్తావించారు.