News March 6, 2025

ఆసిఫాబాద్: MLC కౌంటింగ్.. 60 గంటలు సాగింది

image

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో BJP అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. ఈనెల 3న ఉ. 8 గంటలకు చెల్లుబాటయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేయడం మెుదలు పెట్టగా మంగళవారం ఉ. 10 గంటల వరకు ఈ ప్రక్రియ సాగింది. 11 గంటలకు అభ్యర్థులకు పోలైన ఫస్ట్ ప్రయార్టీ ఓట్ల లెక్కింపు స్టార్ట్ చేయగా బుధవారం 8 గంటలకు అంటే సుమారు 60 గంటల వరకు సాగింది.

Similar News

News December 15, 2025

జైనథ్: ముచ్చటకు మూడోసారి సర్పంచ్‌గా గెలుపు

image

జైనథ్ మండలం కౌట గ్రామ సర్పంచ్‌గా బోయర్ శాలునా విజయ్ ఘన విజయం సాధించారు. గతంలో సైతం ఆమె సర్పంచ్‌గా పని చేశారు. ఇదిలా ఉంటే ఆమె భర్త బోయర్ విజయ్ సైతం సర్పంచ్ సేవలందించారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా ఆమె ఈమారు సైతం విజయం సాధించడం విశేషం. ముచ్చటగా మూడోసారి వారు సర్పంచ్‌గా గెలపొందారు. గ్రామాభివృద్ధికి తాము చేస్తున్న కృషిని గుర్తించే ప్రజలు మరోసారి అవకాశం ఇచ్చారని వారు హర్షం వ్యక్తం చేశారు.

News December 15, 2025

మూడో విడత ఎన్నికలకు సిద్ధం చేయాలి: కలెక్టర్

image

సిద్దిపేట జిల్లాలో జరగనున్న మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హైమావతి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టరేట్‌లో ఆర్డీఓలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో ఆమె జూమ్ సమావేశం నిర్వహించారు. మూడో విడతలో 9 మండలాల్లోని 163 గ్రామ పంచాయతీలు, 1432 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను సూచించారు.

News December 15, 2025

మర్రిగూడ: సాఫ్ట్‌వేర్ to సర్పంచ్

image

సొంతూరుకు సేవ చేయాలనే తపనతో మర్రిగూడకు చెందిన వీరమల్ల శిరీష అనే వివాహిత సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదులుకొని సర్పంచ్‌గా ఎన్నికయింది. శిరీష ఎంటెక్ పూర్తి చేసి ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.