News July 17, 2024

ఆస్ట్రేలియాలో కందుకూరు యువకుడి మృతి

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడు ఆస్ట్రేలియాలో చనిపోయిన విషాద ఘటన ఇది. కందుకూరు పట్టణానికి చెందిన చైతన్య(29) గుంటూరులో బీటెక్‌ పూర్తి చేసి ఆస్ట్రేలియా వెళ్లాడు. గతేడాది వివాహమైంది. చైతన్యతో పాటు బాపట్లకు చెందిన సూర్యతేజ, మరో స్నేహితుడు కలిసి అక్కడి మిల్లామిల్లా జలపాతానికి వెళ్లారు. సూర్యతేజ జలపాతంలోకి జారిపడటంతో అతడిని కాపాడేందుకు చైతన్య దిగారు. ఇద్దరూ ప్రమాదవశాత్తు మునిగి చనిపోయారు.

Similar News

News December 12, 2024

కంభం: వీరుడికి కన్నీటితో సెల్యూట్

image

జమ్మూలో 30 మంది సైనికుల ప్రాణాలు కాపాడి వీరమరణం పొందిన సుబ్బయ్య (45)కు నార్పలలో అభిమానలోకం కన్నీటి వీడ్కోలు పలికింది. పోలీసులు, బంధువులు, ప్రజల అశ్రునయనాల మధ్య వారి సొంత వ్యవసాయ పొలంలో సైనిక లాంచనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. సైనిక అధికారులు గౌరవ వందనం సమర్పించి జాతీయ జెండాను జవాన్ సతీమణికి అందించారు. కన్నీటిని దిగమింగుతూ సుబ్బయ్య భార్య, కుమారుడు, కుమార్తె భౌతికకాయానికి సెల్యూట్ చేశారు.

News December 12, 2024

సింగరాయకొండ: 800 మందిని మోసం చేసిన కి‘లేడీ’

image

మండలంలోని ఉలవపాడుకు చెందిన కామంచి కోటి అనే వ్యక్తి నందిని పొదుపు సంస్థను ప్రారంభించారు. ఈ పొదుపు సంఘాల్లో సింగరాయకొండకు చెందిన పలువురిని చేర్చుకొని 800 మంది చేత రూ.50 లక్షల వరకు కట్టించాడు. కోటి మరణించగా.. అతని భార్య నందిని పొదుపు సంస్థను నడుపుతూ వచ్చింది. గత కొన్ని నెలలుగా సంస్థను మూసివేయడంతో డబ్బులు కట్టిన వారు మోసపోయామని గ్రహించి న్యాయం కోసం సింగరాయకొండ ఎస్సై మహేంద్ర వద్దకు చేరారు.

News December 12, 2024

ప్రకాశం: విదేశాలకు వెళ్లి.. కష్టాలను తీరుస్తాడనుకుంటే!

image

‘మా వాడు బాగా చదివాడు.. విదేశాల్లో గొప్ప ఉద్యోగం చేస్తున్నాడు’ అని ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. ఇంటికి వచ్చి తమను సంతోషంగా చూస్తాడనుకొని ఆనందపడ్డారు. కానీ.. ఓ <<14850503>>రోడ్డు ప్రమాదం<<>> వారి ఆశలను రోడ్డు పాలు చేసింది. ఈ ఘటన చీమకుర్తి బూదవాడలో చోటు చేసుకుంది. బుధవారం చిరంజీవి(32) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అతడితో ప్రయాణించిన నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో ఆ కుటుంబాన్ని శోకసంద్రాన్ని మిగిల్చింది.