News March 7, 2025
ఆస్తి పన్నులను 100% వసూలు చేయాలి: MNCL కలెక్టర్

లక్షెట్టిపేట మున్సిపల్ కార్యాలయాన్ని గురువారం కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. కార్యాలయంలోని రిజిస్టర్లను పరిశీలించి మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల వివరాలను తెలుసుకున్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీలో ఆస్తి పన్నులను 100% వసూలు చేసి పురపాలక సంఘ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
Similar News
News December 10, 2025
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.870 పెరిగి రూ.1,30,310కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.800 ఎగబాకి రూ.1,19,450 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.8,000 పెరిగి రూ.2,07,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 10, 2025
ఏలూరు: కన్నకొడుకే మోసం చేశాడు..!

ముదినేపల్లి మండలం వణుదుర్రు శివారు కొత్తపల్లికి చెందిన డి.కోటేశ్వరమ్మ మంగళవారం మంగళగిరి జనసేన కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో అర్జీ అందించింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇచ్చిన 3 సెంట్ల స్థలంలో నిర్మించుకున్న ఇంటికి తన చిన్న కుమారుడు దొంగపట్టా సృష్టించి ఆక్రమించుకుని మోసం చేశాడని ఆరోపించింది. ఇల్లులేక అంగన్వాడీ కేంద్రం అరుగు మీద ఆశ్రమం పొందుతున్నానని ఫిర్యాదులో పేర్కొంది.
News December 10, 2025
NRPTలో రసవత్తర పోరు.!

నారాయణపేట జిల్లా మరికల్ మండలం ఇబ్రహీంపట్నం గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన చెన్నమ్మ, సుజాతతో పాటు ఈసారి రాధిక, నాగరాణి కొత్తగా బరిలో నిలిచారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, స్వతంత్ర అభ్యర్థులు రంగంలో ఉండడంతో పోరు ఆసక్తిగా మారింది. 485 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో విజయం ఎవరిని వరిస్తుందో ఈ నెల 14న తేలనుంది. గత ఎన్నికల్లో సుజాత విజయం సాధించారు.


