News November 19, 2025
ఆస్పత్రి బెడ్‌షీట్‌లు ఈ రంగులోనే ఎందుకు?

ఏదోక రుగ్మతతో ఆస్పత్రికి వెళ్లే ఉంటారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రిలో బ్లూ, గ్రీన్ బెడ్‌షీట్‌లే ఎక్కువగా ఉంటాయని ఆలోచించారా? RBGకి ప్రాథమిక రంగుల స్వభావం ఉంటుంది. గ్రీన్, బ్లూ క్లాత్‌పై బ్లడ్ పడితే దాని ప్రభావం తగ్గి, నల్లటి ఛాయగా కనిపిస్తుంది. వేరే రంగు వస్త్రాలపై రక్తం పడితే అది డార్క్ రెడ్‌గా కనిపించి, హిమోఫోబియా ఉన్నవారు భయపడకుండా ఈ కలర్స్‌వి వేస్తారు. ఉతికాక వీటి రంగు వెలిసినా తేడా తెలియదు.
Similar News
News January 21, 2026
టోల్ ఫీ పెండింగ్ ఉంటే వాహన సేవలకు బ్రేక్

హైవేలపై టోల్ చెల్లింపుల విషయంలో కేంద్రం కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది. టోల్ ఫీ పెండింగ్ ఉన్న వాహనాలకు ఇకపై వెహికల్ ఓనర్‌షిప్‌కు అవసరమైన NOC, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ రెన్యూవల్, నేషనల్ పర్మిట్ లభించదని స్పష్టం చేసింది. చాలా సందర్భాల్లో వాహనదారులకు తెలియకుండానే బకాయిలు ఏర్పడే అవకాశముంది. టోల్‌ప్లాజా వద్ద టెక్నికల్ సమస్యల వల్ల మనీ కట్ అవ్వకపోవడం కూడా టోల్ ఫీ పెండింగ్‌గా చూపించే అవకాశముంది.
News January 21, 2026
నెల్లూరు: PACSలో ఇక ఆన్‌లైన్ సేవలు

నెల్లూరు జిల్లాలోని 76 PACSలకు గాను 71 సంఘాల్లో పూర్తిస్థాయి కంప్యూటీకరణ చేశామని జిల్లా సహకార శాఖ అధికారి గుర్రప్ప వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఆన్లైన్ ప్రక్రియపై సీఈవోలకు రెండు రోజుల శిక్షణ ఇచ్చామని చెప్పారు. ఇకపై PACS సంఘాల్లో ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. మాన్యువల్ పద్ధతి ఉండదన్నారు.
News January 21, 2026
సంగారెడ్డి: నేడు సదరం శిబిరం

సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఉదయం 10 గంటలకు సదరం శిబిరం నిర్వహిస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. ఆన్ లైన్‌లో ఫ్లాట్ బుక్ చేసుకున్న దివ్యాంగులు మాత్రమే సదరం శిబిరానికి హాజరు కావాలని చెప్పారు. చరవాణికి వచ్చిన సందేశంతో శిబిరానికి హాజరుకావాలని పేర్కొన్నారు.


