News November 19, 2025

ఆస్పత్రి బెడ్‌షీట్‌లు ఈ రంగులోనే ఎందుకు?

image

ఏదోక రుగ్మతతో ఆస్పత్రికి వెళ్లే ఉంటారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రిలో బ్లూ, గ్రీన్ బెడ్‌షీట్‌లే ఎక్కువగా ఉంటాయని ఆలోచించారా? RBGకి ప్రాథమిక రంగుల స్వభావం ఉంటుంది. గ్రీన్‌, బ్లూ క్లాత్‌పై బ్లడ్ పడితే దాని ప్రభావం తగ్గి, నల్లటి ఛాయగా కనిపిస్తుంది. వేరే రంగు వస్త్రాలపై రక్తం పడితే అది డార్క్‌ రెడ్‌గా కనిపించి, హిమోఫోబియా ఉన్నవారు భయపడకుండా ఈ కలర్స్‌వి వేస్తారు. ఉతికాక వీటి రంగు వెలిసినా తేడా తెలియదు.

Similar News

News January 18, 2026

సీపీఐ 100 ఏళ్ల పండుగకు సీఎం

image

ఖమ్మంలో నేడు జరిగే సీపీఐ శతవసంతాల ముగింపు సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు బీజేఎన్ఆర్ డిగ్రీ కాలేజీలో జరిగే సీపీఐ శతాబ్ది ఉత్సవ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. కాగా ఈ సభకు రావాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం సీఎంకు ఆహ్వానం అందించిన విషయం తెలిసిందే. మిత్రపక్షం ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి సభకు వెళ్తున్నారు.

News January 18, 2026

అలంపూర్: దక్షిణ కాశీలో బ్రహ్మోత్సవ సంబరం

image

అలంపూర్ క్షేత్రంలో కొలువై ఉన్న శక్తిపీఠం శ్రీ జోగుళాంబ అమ్మవారు, శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి వారల వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయని ఆలయ ఈవో దీప్తి రెడ్డి ఆదివారం పేర్కొన్నారు. ఈనెల 19 (సోమవారం) నుంచి 23 (శుక్రవారం) వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రతిరోజూ విశేష పూజలు, నిర్వహించనున్నారు. భక్తులు ఈ కార్యక్రమానికి హాజరై స్వామివారి కృప పొందాలన్నారు.

News January 18, 2026

హైదరాబాద్ మళ్లీ ‘ఆమె’దే!

image

త్వరలో ఎన్నికలు జరగనున్న జీహెచ్ఎంసీ కొత్త పాలక మండలిలో మేయర్‌గా మరోసారి మహిళే ఎన్నిక కానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థల ఛైర్మన్లు, మేయర్లకు శనివారం లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. పది మున్సిపల్ కార్పొరేషన్లకు గానూ జీహెచ్ఎంసీకి మహిళ (జనరల్) రిజర్వు కావడంతో రాబోయే పాలకమండలిలోనూ హైదరాబాద్‌లో మహిళే చక్రం తిప్పనున్నారు.